టాలీవుడ్‌లో దగ్గుబాటి రానా, నాగచైతన్య నా క్లోజ్ ఫ్రెండ్స్‌: సాయిపల్లవి (Sai Pallavi)

Updated on Jun 30, 2022 10:00 PM IST
సాయి పల్లవి (Sai Pallavi)
సాయి పల్లవి (Sai Pallavi)

ఫిదా సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సాయిపల్లవి (Sai Pallavi). చేసింది తక్కువ సినిమాలే అయినా భారీ సంఖ్యలో ఫ్యాన్స్‌కు సంపాదించుకుంది. గ్లామర్ షోకి దూరంగా ఉంటూనే నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లతోనే సాయిపల్లవి పాపులర్ అయ్యింది. యూత్‌లో ఆమెకు మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఆడియో ఫంక్షన్లకు, సినిమా ప్రమోషన్లలో జోష్‌గా ఉండడం, తెలుగులో మాట్లాడుతుండడం కూడా సాయిపల్లవికి ఫ్యాన్‌ బేస్‌ పెరగడానికి ఒక కారణం.

తాజాగా నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’, దగ్గుబాటి రానా హీరోగా వచ్చిన ‘విరాటపర్వం’ సినిమాల్లో కీలకపాత్రల్లో నటించి మెప్పించింది సాయిపల్లవి. ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో సాయి ప‌ల్లవికి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నార‌ట‌. రానా, నాగ‌చైత‌న్య ఇద్దరూ త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్స్ అని.. త‌న ఫ్యామిలీ ఎలా అయితే కేర్‌‌ తీసుకుంటుందో అదే విధంగా వాళ్లు కూడా తన గురించి కేర్ తీసుకుంటారని చెప్పింది.

లవ్‌స్టోరీ సినిమాలో నాగచైతన్యతో

విరాట పర్వంలో సాయిపల్లవి (Sai Pallavi), రానా

లేడీ ఓరియంటెడ్ సినిమాలో..

కాగా, ఈ ఇద్దరు హీరోల సినిమాల్లోనూ సాయిపల్లవి నటించింది. ప్రస్తుతం ‘గార్గి’ సినిమాలో నటిస్తోంది. గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది. సాయి పల్లవి (Sai Pallavi) పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, మేకింగ్ వీడియోలకు ప్రేక్షకుల నుంచి విశేష్ స్పందన లభించింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ‘గార్గి’ సినిమా లేడీ ఓరియంటెడ్‌ మూవీగా తెరకెక్కుతోంది.

Read More : Nasser : సినిమాలకు పూర్తిగా దూరంగా కాబోతున్న నాజర్‌!.. అసలు కారణం ఏంటంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!