‘బద్రి’ నుంచి ‘లైగర్’ వరకు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) సినీ ప్రయాణం.. బర్త్‌ డే స్పెషల్‌గా మీకోసం

Updated on Sep 28, 2022 05:46 PM IST
బద్రి సినిమాతో డైరెక్టర్‌‌గా ఇండస్ట్రీకి వచ్చిన పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)  రికార్డులు సృష్టించిన పలు సినిమాలను తెరకెక్కించారు.
బద్రి సినిమాతో డైరెక్టర్‌‌గా ఇండస్ట్రీకి వచ్చిన పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) రికార్డులు సృష్టించిన పలు సినిమాలను తెరకెక్కించారు.

పవన్ కల్యాణ్‌లోని పవర్‌‌ను పరిచయం చేసినా.. మహేష్‌బాబును సూపర్‌‌స్టార్‌‌గా మార్చినా.. రవితేజను మాస్‌మహారాజుగా నిలబెట్టినా.. ఎక్కువ మంది హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేసినా ఆయనకే చెల్లింది. తక్కువ సమయంలో సినిమాను తెరకెక్కించి హిట్‌ కొట్టడం ఆయన స్టైల్.  బ్లాక్‌బస్టర్‌‌ హిట్లతో ఇండస్ట్రీని షేక్‌ చేసి రికార్డుల మోతమోగించిన డాషింగ్ డైరెక్టర్‌‌ పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) పుట్టినరోజు ఇవాళ. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన పూరీ జగన్నాథ్ గురించిన ప్రత్యేక కథనం.

1966వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు పూరీ జగన్నాథ్. ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్దవాడైన పూరీ జగన్నాథ్‌.. సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీకి వచ్చారు. సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా పనిచేశారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు తీసిన పూరీ జగన్నాథ్‌కు సినిమా నిర్మాణ సంస్థలతోపాటు పూరీ కనెక్ట్స్‌ అనే మ్యూజిక్ కంపెనీ కూడా ఉంది.

బద్రి సినిమాతో డైరెక్టర్‌‌గా ఇండస్ట్రీకి వచ్చిన పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)  రికార్డులు సృష్టించిన పలు సినిమాలను తెరకెక్కించారు.

మొదటి సినిమాతోనే..

పవర్‌‌స్టార్ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కిన బద్రి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు పూరీ జగన్నాథ్‌. ఆ సినిమాలో పవన్‌కల్యాణ్‌ స్టైల్, మేనరిజం, డైలాగ్ డిక్షన్, పాటలు అన్నీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. బద్రి సినిమా సూపర్‌‌హిట్ కావడంతో పవన్‌కల్యాణ్‌ స్టార్‌‌ ఇమేజ్ మరింతగా పెరిగింది. 2000వ సంవత్సరంలో విడుదలైన బద్రి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు మొదటి సినిమాతోనే హిట్‌ అందుకున్న పూరీకి విమర్శకుల ప్రశంసలు అందాయి. బద్రి తర్వాత అదే సంవత్సరంలో జగపతిబాబు హీరోగా బాచి అనే సినిమాను తెరకెక్కించారు పూరీ. ఆ సినిమా కమర్షియల్‌గా బిగ్‌ సక్సెస్‌ను అందుకోకపోయినా.. దర్శకుడిగా పూరీకి, హీరోగా జగపతిబాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

బద్రి సినిమాతో డైరెక్టర్‌‌గా ఇండస్ట్రీకి వచ్చిన పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)  రికార్డులు సృష్టించిన పలు సినిమాలను తెరకెక్కించారు.

రవితేజను స్టార్‌‌గా..

అప్పటివరకు చిన్నచిన్న క్యారెక్టర్లు చేస్తూ, చిన్న సినిమాల్లో హీరోగా చేస్తున్న రవితేజ (RaviTeja)ను స్టార్ హీరోను చేసింది పూరీ జగన్నాథ్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం. ఈ సినిమాతో రవితేజ హీరోగా నిలదొక్కుకున్నారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా కథకు నంది అవార్డు అందుకున్నారు పూరీ. ఈ సినిమా తర్వాత ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమాలు తెరకెక్కించారు పూరీ జగన్నాథ్​. ఈ సినిమాలు సూపర్‌‌హిట్ కావడంతో రవితేజకు స్టార్‌‌ హీరో ఇమేజ్ వచ్చింది. అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమాలో రాసిన డైలాగులకు బెస్ట్‌ డైలాగ్ రైటర్‌‌గా నంది అవార్డు (Nandi Awards) అందుకున్నారు పూరీ జగన్నాథ్.

బద్రి సినిమాతో డైరెక్టర్‌‌గా ఇండస్ట్రీకి వచ్చిన పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)  రికార్డులు సృష్టించిన పలు సినిమాలను తెరకెక్కించారు.

హిట్‌ టాక్ రాకున్నా..

బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమాలు సూపర్‌‌హిట్‌ కావడంతో హిట్‌ సినిమాల దర్శకుడిగా పూరీ జగన్నాథ్​కు పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా తెరకెక్కించిన శివమణి, జూనియర్‌‌ ఎన్టీఆర్‌ ( Junior NTR)‌ హీరోగా తీసిన ఆంధ్రావాలా డిజాస్టర్‌‌లుగా నిలిచాయి. అయితే ఈ సినిమాలు ఫ్లాప్ అయినా దర్శకుడిగా పూరీకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

తమ్ముడు సాయిరాం శంకర్‌‌తో..

పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలు సరిగ్గా ప్రేక్షకులకు చేరువకాకపోవడంతో.. ఈసారి తన తమ్ముడినే హీరోగా పెట్టి 143 పేరుతో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అనంతరం నాగార్జున హీరోగా సూపర్‌‌ సినిమా తీశారు పూరీ. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో కామెడీకి మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో పూరీ జగన్నాథ్‌కు అవకాశాలు తగ్గాయి. దీంతో  పూరీ పని అయిపోయిందని అనుకున్నారు అందరూ.

బద్రి సినిమాతో డైరెక్టర్‌‌గా ఇండస్ట్రీకి వచ్చిన పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)  రికార్డులు సృష్టించిన పలు సినిమాలను తెరకెక్కించారు.

ఈసారి ఇండస్ట్రీ హిట్‌తో..

దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌ పని అయిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో ఇండస్ట్రీ హిట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పూరీ. సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) హీరోగా పోకిరి సినిమాను తెరకెక్కించారు. అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అప్పటివరకు మహేష్‌ను క్లాస్ లుక్‌లో చూసిన అభిమానులు.. మాస్ లుక్‌, పంచ్ డైలాగులకు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత మహేష్‌ కెరీర్‌‌ గ్రాఫ్‌ మరింతగా పెరిగింది. పోకిరి సినిమాకు బెస్ట్‌ డైరెక్టర్‌‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డుతోపాటు సంతోషం అవార్డును అందుకున్నారు పూరీ జగన్నాథ్. అంతేకాదు, బెస్ట్‌ పాపులర్ ఫీచర్ సినిమాగా నంది అవార్డును కూడా గెలుచుకున్నారు.

బద్రి సినిమాతో డైరెక్టర్‌‌గా ఇండస్ట్రీకి వచ్చిన పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)  రికార్డులు సృష్టించిన పలు సినిమాలను తెరకెక్కించారు.

దేశముదురుగా..

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా పూరీ జగన్‌ తెరకెక్కించిన సినిమా దేశముదురు. ఈ సినిమాలో బన్నీ యాక్షన్, డైలాగ్ డిక్షన్‌ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. దేశముదురు సినిమా కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అల్లు అర్జున్‌ను యూత్‌కు మరింత దగ్గర చేసింది. ఈ సినిమాలో డైలాగులతో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పూరీ.. డాన్స్‌, ఫైట్లతో అభిమానులను ఫిదా చేశారు.

బద్రి సినిమాతో డైరెక్టర్‌‌గా ఇండస్ట్రీకి వచ్చిన పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)  రికార్డులు సృష్టించిన పలు సినిమాలను తెరకెక్కించారు.

ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ..

మెగాస్టార్ చిరంజీవి కొడుకు రాంచరణ్‌ (RamCharan)ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతలను తీసుకున్నారు పూరీ జగన్నాథ్. రాంచరణ్‌ హీరోగా తెరకెక్కిన చిరుత సినిమా హిట్‌ అయ్యింది. ఈ సినిమా చెర్రీని హీరోగా నిలదొక్కుకునేలా చేసింది. ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన బుజ్జిగాడు, నేనింతే, ఏక్‌నిరంజన్ సినిమాలు నిరాశపరిచాయి. అనంతరం గోపీచంద్ (Gopichand) హీరోగా తెరకెక్కించిన గోలీమార్ సినిమా.. పూరీ రేంజ్‌ హిట్‌ కాకపోయినా మంచి వసూళ్లనే రాబట్టింది. దగ్గుబాటి రానా (Rana Daggubati) హీరోగా తీసిన అందాల రాక్షసి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

బిగ్‌బీ అమితాబ్‌తో..

వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న సమయంలోనే పూరీ జగన్నాథ్‌.. బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌తో సినిమా చేసే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ‘బుడ్డా హోగా తేరా బాప్’ టైటిల్‌తో సినిమా తీసి మరోసారి హిట్‌ ట్రాక్‌ ఎక్కారు పూరీ జగన్నాథ్. ఈ సినిమా విజయం ఇచ్చిన జోష్‌లో మహేష్‌బాబుతో బిజినెస్‌మ్యాన్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కూడా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బిజినెస్‌మ్యాన్ సినిమాకు బెస్ట్‌ డైరెక్టర్‌‌గా సంతోషం అవార్డును అందుకున్నారు.

బద్రి సినిమాతో డైరెక్టర్‌‌గా ఇండస్ట్రీకి వచ్చిన పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)  రికార్డులు సృష్టించిన పలు సినిమాలను తెరకెక్కించారు.

వరుస ఫ్లాపులే..

బిజినెస్‌మ్యాన్ సినిమా తర్వాత పూరీ తెరకెక్కించిన సినిమాల్లో కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు, ఇద్దరమ్మాయిలతో, లోఫర్, ఇజమ్, పైసావసూల్ సినిమాలు ఫర్వాలేదనిపించినా.. దేవుడు చేసిన మనుషులు, హార్ట్‌ఎటాక్, జ్యోతిలక్ష్మి, లోఫర్, మెహబూబా సినిమాల ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి. యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌‌ హీరోగా తెరకెక్కించిన టెంపర్‌‌ సినిమా పూరీకి ఊరట ఇచ్చింది. ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో తీసిన ‘ఇస్మార్ట్ శంకర్‌‌’ సినిమా హిట్‌ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా రామ్‌తోపాటు, పూరీ జగన్నాథ్‌ను కూడా ఫ్లాప్‌ల నుంచి బయటపడేసింది.

లైగర్‌‌తో మళ్లీ నిరాశే..

ఏ హీరోతోనైనా 100 రోజులలోపే సినిమా తీసి విడుదల చేసే పూరీ జగన్నాథ్‌.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో తెరకెక్కించిన సినిమా లైగర్ (Liger). విజయ్ కెరీర్‌‌లో భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్‌‌ టాక్‌ను సొంతం చేసుకుంది. లైగర్ సినిమాకు దర్శకుడిగానే కాకుండా ఒకానొక నిర్మాతగా కూడా వ్యవహరించారు పూరీ. ఈ సినిమా ఫలితంతో పూరీ జగన్నాథ్‌కు భారీగా నష్టం వచ్చిందని టాక్.

బద్రి సినిమాతో డైరెక్టర్‌‌గా ఇండస్ట్రీకి వచ్చిన పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)  రికార్డులు సృష్టించిన పలు సినిమాలను తెరకెక్కించారు.

అయితే, సక్సెస్‌లు వచ్చినప్పుడు పొంగిపోకుండా.. ఫెయిల్యూర్‌‌లు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండడం పూరీ జగన్నాథ్‌కు బాగా తెలుసు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సూపర్‌‌హిట్ సినిమాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్‌‌గా కోట్లు సంపాదించారు పూరీ జగన్నాథ్‌. ఆ డబ్బులను సినిమాలను నిర్మించడానికి ఖర్చు చేసి అప్పులపాలయ్యారు. దాదాపుగా తన ఆస్తులన్నీ అమ్మేసి.. అద్దె ఇంట్లోకి మారారు కూడా. అయినా సరే ఏ మాత్రం కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ఎదిగి తనను తాను నిరూపించుకున్నారు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh).

Read More : ‘జనగణమన’ తర్వాత సల్మాన్‌ఖాన్ (Salman Khan)తో సినిమా చేయనున్న పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)!

 
 
సక్సెస్‌లో పొంగిపోకుండా.. ఫెయిల్యూర్‌‌లో కుంగిపోకుండా.. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ, పాతాళానికి పడిపోయినా పైకి లేచే సత్తా ఉన్న
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!