సమంత (Samantha) ‘శాకుంతలం’ నుంచి దుష్యంతుడి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్.. గుర్రంపై ఇంటెన్సివ్‌గా నటుడు దేవ్‌ మోహన్

Updated on Sep 18, 2022 06:32 PM IST
సమంత (Samantha) ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, యశోద, ఖుషి సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో కొన్ని ప్రాజెక్టులకు కమిట్ అయ్యారు.
సమంత (Samantha) ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, యశోద, ఖుషి సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో కొన్ని ప్రాజెక్టులకు కమిట్ అయ్యారు.

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న సినిమా శాకుంతలం. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. శాకుంతలం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది.

మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న శాకుంతలం సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో కీలకపాత్రలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్ నటించారు. ఆదివారం దేవ్ మోహన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా శాకుంతలం సినిమాలో ఆయన క్యారెక్టర్‌‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్ శాకుంతలం సినిమాలో నటిస్తున్నారు. దుష్యంతుడి క్యారెక్టర్‌‌లో గుర్రంపై ఉన్న పోస్టర్‌‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌‌లో ఇంటెన్సివ్‌ లుక్‌లో కనిపిస్తున్నారు దేవ్ మోహన్. గుర్రంపై యుద్ధ వీరుడిలా ఉన్నారు.

సమంత (Samantha) ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, యశోద, ఖుషి సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో కొన్ని ప్రాజెక్టులకు కమిట్ అయ్యారు.

ఏడు సంవత్సరాల తర్వాత..

భారీ బడ్జెట్‌తో గుణశేఖర్‌‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటించారు. సమంత కెరీర్‌‌లోనే శాకుంతలం సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సమర్పణలో గుణ టీం వర్క్స్‌ బ్యానర్‌‌పై నీలిమా గుణ శాకుంతలం సినిమాను నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాను వచ్చే సంవత్సరం విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన రుద్రమదేవి సినిమా తర్వాత గుణశేఖర్‌‌ తెరకెక్కిస్తున్న సినిమా శాకుంతలం. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత గుణశేఖర్ సినిమా తీస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాటు భారీ అంచనాలతో గుణశేఖర్‌‌.. రుద్రమదేవి సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం సమంత (Samantha) ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాపైనే గుణశేఖర్ ఆశలన్నీ పెట్టుకున్నారు.

Read More : మోస్ట్‌ పాపులర్ తెలుగు సెలబ్రిటీగా ప్రభాస్ (Prabhas)..ఫిమేల్ సెలబ్రిటీ సమంత (Samantha):ఆర్మాక్స్‌ మీడియా సర్వే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!