వినాయక చవితి సందర్భంగా హీరోయిన్ సమంత (Samantha) యశోద సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ రానుందా!

Updated on Aug 31, 2022 11:55 AM IST
నాగచైతన్యతో విడాకుల తర్వాత హీరోయిన్ సమంత (Samantha) సినిమాలను ఓకే చేస్తూ వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు
నాగచైతన్యతో విడాకుల తర్వాత హీరోయిన్ సమంత (Samantha) సినిమాలను ఓకే చేస్తూ వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటిస్తున్న సినిమా యశోద. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. తాజాగా యశోద సినిమా టీం సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. వినాయక చవితి సందర్బంగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.

నాగచైతన్యతో విడాకుల తర్వాత సినిమాల విషయంలో దూకుడు పెంచారు సమంత. వరుస సినిమాలతో బిజీగా మారారు. ఒకదాని తర్వాత మరొకటిగా పాన్ ఇండియా సినిమాలను ఓకే చేస్తూ వాటిని పూర్తి చేసే పనిలో పడ్డారు సమంత. తెలుగులో 'ఏ మాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తన మాయలో పడేశారు ఈ బ్యూటీ.

నాగచైతన్యతో విడాకుల తర్వాత హీరోయిన్ సమంత (Samantha) సినిమాలను ఓకే చేస్తూ వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు

షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా..

ది ఫ్యామిలీ మ్యాన్‌–2 వెబ్‌ సిరీస్, కాత్తు వాక్కుల రెండు కాదల్‌ తర్వాత సమంత తమిళ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. యశోద సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. యశోద కూడా షూటింగ్‌ పూర్తయ్యింది. కాగా ప్రస్తుతం యశోద సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి.

వినాయకచవితి సందర్భంగా యశోద మూవీకి సంబంధించి ఒక అప్‌డేట్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు యశోద టీమ్ ప్రకటించింది. సైన్స్ ఫిక్షన్ జానర్ కథగా తెరకెక్కుతున్న ఈ మూవీని హరి – హరీష్ తెరకెక్కించగా శ్రీదేవి మూవీస్ బ్యానర్‌‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఇటీవలే రిలీజ్ అయిన సమంత (Samantha) యశోద ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న యశోద సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. యదార్థ సంఘటన ఆధారంగా క్రైమ్, థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న యశోద చిత్రాన్ని ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. సినిమా విడుదల వాయిదా పడింది. 

Read More : సమంత (Samantha) యాటిట్యూడ్‌, మాటలకు అక్షయ్‌ కుమార్ ఫిదా? తన పక్కన నటించే చాన్స్‌ ఇచ్చేశారా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!