Liger: లైగ‌ర్ అప్‌డేట్స్ తెలిస్తే షాక్ అవాల్సిందే.. అన‌న్య‌తో విజిల్ వేయిస్తున్న విజ‌య్ !

Updated on Jul 07, 2022 01:29 PM IST
Liger: లైగ‌ర్ సినిమా టీజ‌ర్‌ను జూలై 8 న రిలీజ్ చేయ‌నున్నారు.
Liger: లైగ‌ర్ సినిమా టీజ‌ర్‌ను జూలై 8 న రిలీజ్ చేయ‌నున్నారు.

Liger: పాన్ ఇండియా సినిమా 'లైగ‌ర్' నుంచి కొత్త పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda), అన‌న్య పాండేలు జంట‌గా ఉన్న ఫ‌స్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ ఆగ‌స్టు 25 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ బ‌డా నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

'లైగ‌ర్' సినిమా టీజ‌ర్‌ను జూలై 8 న రిలీజ్ చేయ‌నున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే న‌టించిన‌ 'అక్‌డి ప‌క్‌డి' అనే పాట‌ను జూలై 11న విడుద‌ల చేయ‌నున్నారు. లైగ‌ర్ సినిమాను ఆగ‌స్టు 25 న రిలీజ్ చేయ‌నున్నారు. సినిమా విడుద‌ల‌కు ఇంకా నెల రోజుల స‌మ‌యం ఉండ‌టంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ల జోరు పెంచింది. ఇటీవలే నిర్మాతలు విజ‌య్ దేవ‌ర‌కొండ బోల్డ్ ఫోటోను రిలీజ్ చేశారు. తాను 'లైగ‌ర్' సినిమా కోసం ఎంతో శ్ర‌మించాన‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

లైగ‌ర్ ఓ బాక్స‌ర్ క‌థ‌!
బాక్సింగ్ నేప‌థ్యంలో 'లైగ‌ర్' సినిమా తెర‌కెక్కుతోంది.అంతర్జాతీయ బాక్సర్, లెజండరీ స్పోర్ట్స్‌మ్యాన్ మైక్ టైసన్ కూడా 'లైగ‌ర్' సినిమాలో న‌టిస్తున్నారు.'సాలా.. క్రాస్ బ్రీడ్' అనే డైలాగ్ ఈ సినిమాలోని ఏదో ప‌వ‌ర్ ఫుల్‌ సందర్భాన్ని గురించి చెబుతుంది . ఈ సినిమాలో మైక్ టైస‌న్ ఇండియ‌న్ మహిళను పెళ్లి చేసుకుంటాడని ముందుగానే కథను ఊహించి పలువురు పోస్టులు పెడుతున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. 

'లైగ‌ర్' సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టిస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 'లైగ‌ర్' ఆగ‌స్టు 25న విడుద‌ల కానుంది. ఈ సినిమాను రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో హీరోయిన్ ఛార్మి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌లు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో  విడుదల కానుంది. 

Read More: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) – పూరీ జగన్నాథ్‌ కాంబోలో మూడో సినిమా? వైరల్‌ అవుతున్న న్యూస్‌లో నిజమెంత?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!