విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) – పూరీ జగన్నాథ్‌ కాంబోలో మూడో సినిమా? వైరల్‌ అవుతున్న న్యూస్‌లో నిజమెంత?

Updated on Jul 01, 2022 10:22 AM IST
పూరీ జగన్నాథ్‌తో విజయ్ దేవరకొండ
పూరీ జగన్నాథ్‌తో విజయ్ దేవరకొండ

ఇస్మార్ట్​ శంకర్​ సినిమాతో దశాబ్దకాలంగా ఉన్న ఫ్లాప్​ టాక్​ని పటాపంచలు చేసి మరోసారి తన మాస్ ​పంచ్​ పవర్​ని నిరూపించుకున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్​. అదే ఊపులో టాలీవుడ్​ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో ‘లైగర్’ సినిమా మొదలెట్టేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ పూర్తిచేసుకుని పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు జరుగుతున్నాయి. పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా ఫలితం తేలకుండానే ‘జనగణమన’ షూటింగ్​ కూడా ప్రారంభించేశాడు పూరీ.

ఐతే లైగర్​ సినిమా ఫలితం చూడకుండానే పూరీతో ‘జేజీఎం’ సినిమాకు విజయ్ రెడీ అయిపోవడం రౌడీ హీరో అభిమానులకు కాస్త ఇబ్బందిగానే ఉంది. పూరి హడావుడిగా ఈ సినిమాకు కమిట్ చేయించేశాడని.. ‘లైగర్’ రిలీజయ్యే వరకు విజయ్ ఆగాల్సిందని సోషల్​మీడియా వేదికగా చర్చ సాగుతూనే ఉంది. ఐతే కమిటయ్యాడు కాబట్టి సినిమా చేయక తప్పదు అనుకుంటుండగా.. పూరీతో విజయ్ మరో సినిమా కూడా చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

జనగణమన సినిమాలో విజయ్ దేవరకొండ

‘జనగణమన’ షూటింగ్‌ రెగ్యులర్‌‌గా..

ఇంకా ‘జేజీఎం’ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకముందే పూరీతో మరో సినిమా చేయడానికి విజయ్ కమిట్మెంట్ ఇచ్చేశాడని అంటున్నారు. విజయ్-పూరి జగన్నాథ్‌ కలయికలో హ్యాట్రిక్ మూవీ రాబోతోందని కొన్ని పీఆర్వో హ్యాండిల్స్ నుంచి కూడా ట్వీట్లు పడుతున్నాయి. ఐతే ‘లైగర్’ ప్రమోషన్లు ఇప్పుడే మొదలవుతున్న నేపథ్యంలో హైప్ కోసం ఈ విషయాన్ని లీక్ చేశారేమో అన్న డౌట్లు కొడుతున్నాయి.

పూరీ జగన్నాథ్‌, విజయ్ దేవరకొండ, చార్మీ కౌర్

‘లైగర్’ రిలీజై దాని రిజల్ట్ చూశాక కానీ పూరి ఇప్పుడెలాంటి ఫాంలో ఉన్నాడో తెలియదని.. అది కనుక తేడా కొడితే ‘జేజీఎం’ విషయంలోనే సందేహాలు నెలకొంటాయని, అలాంటపుడు మరో సినిమా చేయడానికి ఇప్పుడే కమిట్మెంట్ ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యంగ్ ఫిలిం మేకర్స్, ట్రెండీ డైరెక్టర్లు చాలా మంది ఎదురు చూస్తుండగా.. విజయ్ (Vijay Deverakonda) ఇలా పూరీతో లాక్ అయిపోవడం చాలామందికి రుచించడం లేదు. మరి విజయ్.. నిజంగానే పూరీతో మరో సినిమాకు కమిటయ్యాడా లేదా అన్నది క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Read More : నా అభిమాన బాక్సర్, లెజెండ్ మైక్ టైసన్‌కు జన్మదిన శుభాకాంక్షలు : విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!