అల్లు అర్జున్‌ (Allu Arjun) ‘పుష్ప2’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలు కానుందో తెలుసా!

Updated on Sep 09, 2022 10:16 PM IST
పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌‌గా క్రేజ్‌ సంపాదించుకున్నారు అల్లు అర్జున్‌ (Allu Arjun)
పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌‌గా క్రేజ్‌ సంపాదించుకున్నారు అల్లు అర్జున్‌ (Allu Arjun)

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వచ్చిన పుష్ప సినిమా సూపర్‌‌హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప2 సినిమా తెరకెక్కనుంది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్‌ వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన.. సౌత్‌తో పాటు నార్త్‌ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకుంది.

ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బన్నీ అభిమానులు. పుష్ప2 సినిమాపై ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌‌గా క్రేజ్‌ సంపాదించుకున్నారు అల్లు అర్జున్‌ (Allu Arjun)

పూజా కార్యక్రమాలు..

పుష్ప2 సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెలలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. పుష్ప2 సినిమా షూటింగ్ సెప్టెంబర్‌‌ 22వ తేదీ నుంచి జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.  

పుష్ప సినిమాలో  అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా మాస్‌ లుక్‌‌లో నటించారు. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కనున్న పుష్ప2 సినిమాలో కొద్దిపాటి మార్పులతో అదే లుక్‌లో బన్నీ కనిపించనున్నారని టాక్. పుష్ప2 సినిమా కోసం అల్లు అర్జున్‌ ఏకంగా రూ.125 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్.

పుష్ప2 సినిమాలో కూడా అల్లు అర్జున్‌ (Allu Arjun) సరసన రష్మికా మందాన హీరోయిన్‌గా నటించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సాయి పల్లవి కీలకపాత్రలో కనిపించనున్నారని సమాచారం. దాదాపు 10 నిమిషాల క్యారెక్టర్‌‌లో సాయి పల్లవి కనిపించనున్నారని తెలుస్తోంది. గిరిజన యువతి పాత్రలో సాయి పల్లవి నటించనున్నట్టు సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.  

Read More : పుష్ప2 తర్వాత అల్లు అర్జున్‌(Allu Arjun)తో సినిమా చేయాలని త్రివిక్రమ్(Trivikram Srinivas) ప్లాన్ చేస్తున్నారా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!