అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన పుష్ప (Pushpa) సినిమాలో విలన్‌గా ఫహాద్‌ ఫాజిల్‌ ఫస్ట్‌ చాయిస్ కాదట!

Updated on Aug 30, 2022 06:06 PM IST
అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప2 సినిమా షూటింగ్‌ పూజా కార్యక్రమం ఇటీవలే జరిగింది
అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప2 సినిమా షూటింగ్‌ పూజా కార్యక్రమం ఇటీవలే జరిగింది

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun)ను పాన్‌ ఇండియా స్టార్‌‌ను చేసిన సినిమా పుష్ప (Pushpa). ఈ సినిమాలో బన్నీ నటన, యాటిట్యూడ్‌కు ఫ్యాన్స్‌తోపాటు సినీ ప్రేమికులు కూడా ఫిదా అయ్యారు. అల్లు అర్జున్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. పుష్ప సినిమాకు ముందుగా నెగెటివ్‌ టాక్‌ వచ్చినా తర్వాత బ్లాక్‌బస్టర్‌‌ హిట్‌గా నిలిచింది.

హిందీలో కూడా పుష్ప సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అక్కడ కూడా దాదాపుగా రూ.100 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో పుష్ప2 సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్‌2 కూడా భారీ విజయాన్ని సాధించడంతో పుష్పకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న పుష్ప2 ది రైజ్‌ సినిమాపై కూడా అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. 

అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప2 సినిమా షూటింగ్‌ పూజా కార్యక్రమం ఇటీవలే జరిగింది

ఆరుగురి తర్వాత..

'పుష్ప' పార్ట్1లో విలన్‌గా ఫహాద్ ఫాజిల్ నటించారు. బన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌‌లో అద్భుతంగా నటించి సినిమా విజయంలో కీలకపాత్ర పోషించారు ఫహాద్.  అయితే పుష్ప సినిమాలో విలన్ పాత్రకు ఫహాద్ ఫాజిల్ మొదటి ఛాయిస్ కాదట. చాలా మంది రిజెక్ట్ చేస్తేనే ఆ చాన్స్‌ ఫహాద్‌ వరకు వెళ్లిందని సమాచారం.

'పుష్ప' లో విలన్‌గా చేయాలని చియాన్‌ విక్రమ్‌ను కోరిందట పుష్ప టీమ్. అయితే ఈ ఆఫర్‌‌ను విక్రమ్ సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత విజయ్ సేతుపతిని చేయమని అడుగగా.. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో పుష్ప ప్రాజెక్ట్‌ నుంచి విజయ్‌ సేతుపతి కూడా తప్పుకున్నారు.  వీళ్లిద్దరూ కాకుండా 'భీష్మ' సినిమాలో విలన్‌గా నటించిన జిష్షు సేన్‌గుప్తాని కూడా పుష్ప సినిమాలో విలన్‌గా చేయాలని సంప్రదించిందట చిత్ర యూనిట్. కొన్ని అనివార్య కారణాలతో ఆయన కూడా ఈ ప్రాజెక్ట్‌కు దూరమయ్యారు. ఇక,  మాధవన్, ఆర్య కూడా  వేరే ప్రాజెక్టులకు కమిట్ అవ్వడంతో అల్లు అర్జున్‌ (Allu Arjun) పుష్ప (Pushpa) సినిమాలో విలన్‌గా చేయలేకపోయారు అని తెలుస్తోంది.  

Read More : Pushpa 2: 'పుష్ప 2' హ‌క్కుల కోసం ఓటీటీ సంస్థ‌ల పోటీ!.. సినిమాపై క్రేజ్ పెంచుతున్న బ‌న్ని (Allu Arjun)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!