అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ మామూలుగా లేదుగా.. బన్నీని పొగడ్తలతో ముంచెత్తిన హీరోయిన్‌ జాన్వీ కపూర్ !

Updated on Aug 28, 2022 07:51 PM IST
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌‌గా ఎదిగిన అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌‌గా ఎదిగిన అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్‌‌గా పేరు తెచ్చుకున్న బన్నీ.. 'పుష్ప' సినిమాతో తన క్రేజ్‌ను పాన్ ఇండియా రేంజ్‌కు పెంచుకున్నారు.

ఇప్పుడు 'పుష్ప 2'తో ఆ క్రేజ్‌ను మరింతగా పెంచుకోవాలని భావిస్తున్నారు అల్లు అర్జున్. 'పుష్ప 2' సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించి, పూజా కార్యక్రమాన్ని నిర్వహించింది చిత్ర యూనిట్.  ప్రస్తుతం బన్నీ ఫ్యాన్‌ బేస్ ఎలా ఉందంటే.. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా బన్నీకి అభిమానులుగా మారిపోతున్నారు. 

 

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌‌గా ఎదిగిన అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు

పుష్పతో వచ్చిన క్రేజ్‌తో..

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌ను సంపాదించుకున్న అల్లు అర్జున్.. ఈ మధ్య కాలంలో యాడ్స్ చేస్తూ పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు.  ఇప్పటికే ఎన్నో రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్.. తాజాగా కోకా కోలా యాడ్‌తో  అభిమానుల ముందుకు వచ్చారు.

ఇక కోకా కోలా యాడ్‌లో ఒక పాటకు డాన్స్ చేస్తూ, బన్నీ తన అభిమానులను అలరించారు. అల్లు అర్జున్ డాన్స్ చేస్తున్న యాడ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.  అల్లు అర్జున్ చేస్తున్న యాడ్స్‌పై హీరోయిన్‌ జాన్వీ కపూర్ స్పందించారు. ‘యాడ్స్ ద్వారా మెస్మరైజింగ్ చేసే క్యాపాసిటీ అల్లు అర్జున్‌కే ఉంది' అన్నారు జాన్వీ. ఏదేమైనా, అల్లు అర్జున్ (Allu Arjun) నేషనల్ వైడ్‌గా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నారు.

Read More : తన మొదటి హీరోయిన్‌ను కలుసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ఫోటోలు వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!