నిఖిల్‌ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా నైజాం కలెక్షన్లు ఎంతంటే?

Updated on Aug 14, 2022 10:14 PM IST
యంగ్‌ హీరో నిఖిల్ సిద్దార్థ్‌ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా మంచి  టాక్‌తో దూసుకుపోతోంది
యంగ్‌ హీరో నిఖిల్ సిద్దార్థ్‌ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది

యంగ్‌ హీరో నిఖిల్ సిద్దార్థ్‌ (Nikhil), హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్‌లో వచ్చిన థ్రిల్లర్‌ సినిమా కార్తికేయ2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 13వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.  

తొలి రోజు నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది కార్తికేయ2 సినిమా. నైజాం ఏరియాలో ఈ సినిమాకు రిలీజ్ రోజున వచ్చిన కలెక్షన్లపై ఓ అప్‌డేట్ ఫిలింనగర్ సర్కిల్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

యంగ్‌ హీరో నిఖిల్ సిద్దార్థ్‌ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా మంచి  టాక్‌తో దూసుకుపోతోంది

నిఖిల్ కెరీర్‌‌లో టాప్ కలెక్షన్లు..

తాజా సమాచారం ప్రకారం.. నైజాంలో రూ.1.2 కోట్లు రాబట్టిందని టాక్. నిఖిల్ కెరీర్‌లోనే ఈ కలెక్షన్లు టాప్ అని సమాచారం. మంచి టాక్‌తో ఆదివారం కూడా కార్తికేయ2 సినిమా మంచి కలెక్షన్లు రాబడుతుందని తెలుస్తోంది. తెలుగుతోపాటు వివిధ భాషల్లో విడుదలైన కార్తికేయ2 సినిమా రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్లు రాబడుదుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.  

నిఖిల్‌ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, బాలీవుడ్ యాక్టర్ అనుపమ్‌ ఖేర్, ఆదిత్యా మీనన్‌, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించారు. కాలభైరవ మ్యూజిక్ అందించిన కార్తికేయ2 సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.

Read More : కార్తికేయ 2 (Karthikeya 2) ట్విట్ట‌ర్ రివ్యూ - కృష్ణుడి ర‌హ‌స్యాల‌ను చేధించిన నిఖిల్ (Nikhil Siddhartha)! 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!