మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న నిఖిల్ (Nikhil) కార్తికేయ 2..హిందీలో థియేటర్లు పెంచారని టాక్

Updated on Aug 18, 2022 12:25 PM IST
నిఖిల్ (Nikhil) కార్తికేయ2 సినిమా కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
నిఖిల్ (Nikhil) కార్తికేయ2 సినిమా కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

నిఖిల్ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'కార్తికేయ 2'. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ద్వారకా నగరం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ 'కార్తికేయ' చిత్రంలో మాదిరిగానే ఎన్నో ట్విస్ట్‌లతో రూపొందింది. మొదటి రోజు ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో, వీకెండ్‌కే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించింది.రోజురోజుకీ ఈ చిత్రానికి ఆదరణ పెరుగుతూనే ఉంది. హిందీలో కూడా ఈ మూవీ అనుకోని రీతిలో వసూళ్లను కలెక్ట్ చేసింది.

నిఖిల్ (Nikhil) కార్తికేయ 2 సినిమా కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

నాలుగు రోజుల కలెక్షన్స్ గమనిస్తే:

నైజాం  - 4.97 cr

సీడెడ్ -  2.12 cr

ఉత్తరాంధ్ర - 1.76 cr

ఈస్ట్ - 1.16 cr

వెస్ట్ - 0.83 cr

గుంటూరు - 1.32 cr

కృష్ణా - 1.03 cr

నెల్లూరు - 0.47 cr

ఏపీ + తెలంగాణ (టోటల్) - 13.66 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా - 1.02 cr

ఓవర్సీస్ - 2.65 cr

హిందీ మరియు ఇతర వెర్షన్లు - 1.10 cr

వరల్డ్ వైడ్ (టోటల్) - 18.43 cr

కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్‌గా, రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే, రూ.18 కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉంది. నాలుగు రోజులు పూర్తయ్యేసరికి నిఖిల్ (Nikhil) నటించిన కార్తికేయ సినిమా వరల్డ్ వైడ్​గా రూ.18.43 కోట్ల షేర్ రాబట్టింది.  

 Read More : Karthikeya 2 Trailer: 'ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం..' ఆసక్తికరంగా 'కార్తికేయ 2' ట్రైలర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!