నిఖిల్‌ (Nikhil Siddartha), అనుపమ పరమేశ్వరన్‌ మధ్య అందమైన లవ్ స్టోరీ.. ఆకట్టుకుంటున్న ‘18పేజెస్‌’ (18 Pages) ట్రైలర్!

Updated on Dec 18, 2022 11:12 AM IST
‘18పేజెస్‌’ (18 Pages)  ట్రైలర్‌లో నిఖిల్, అనుపమల (Anupama Parameswaran) మధ్య కెమిస్ట్రీని చాలా అందంగా చూయించారు.
‘18పేజెస్‌’ (18 Pages) ట్రైలర్‌లో నిఖిల్, అనుపమల (Anupama Parameswaran) మధ్య కెమిస్ట్రీని చాలా అందంగా చూయించారు.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌ సిద్దార్థ (Nikhil Siddartha), అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘18పేజెస్‌’ (18 Pages). ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చ‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ ప‌తాకాల‌పై బ‌న్నీవాసు నిర్మిస్తున్నారు. ‘కుమారి 21F’ సినిమా ఫేమ్ దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాను యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో రూపొందించాడు. విభిన్నమైన ప్రేమ కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సుకుమార్‌ కథను అందించడం విశేషం.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అంచనాలను రెట్టింపు చేశాయి. తాజాగా ‘18పేజెస్‌’ (18 Pages Pre Release Event) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడకకు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఫీల్ గుడ్ రొమాంటిక్ సీన్స్‌తో నిండిపోయింది. ఇక ఈ సినిమాలో నిఖిల్, అనుపమల మధ్య జరిగే లవ్ ట్రాక్ సరికొత్తగా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 

ఈ ట్రైలర్‌లో నిఖిల్, అనుపమల (Anupama Parameswaran) మధ్య కెమిస్ట్రీని చాలా అందంగా చూయించారు. ‘‘ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు.. ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే ఆన్సర్ ఉండకూడదు’’ అనే డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక, ట్రైలర్ చూస్తే.. స్మార్ట్ ఫోన్స్, ఫేస్‌బుక్ అంటూ ఫోన్ లోనుంచి తల తిప్పని యువతే ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో అసలు ఫోన్ అనేదే ఉపయోగించకుండా, ఫేస్‌బుక్‌లో అకౌంట్ అనేదే లేకుండా జీవితాన్ని గడిపేస్తున్న ఒక అమ్మాయితో యూనిక్ లవ్ స్టోరీ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం ఇది అని అర్థమవుతోంది. 

అదే సమయంలో హీరోయిన్ కిడ్నాప్ సీన్స్, ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన హీరోకు ఎదురైన సవాళ్లు, ఇతర అనేక యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి. హీరోయిన్ అనుపమ రాసుకున్న 18పేజీలను హీరో నిఖిల్ (Hero Nikhil) చదువుతాడు. ఈ సినిమాను దర్శకుడు సూర్యప్రతాప్ అద్భుతమైన ప్రేమకావ్యంగా మలిచిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Read More: డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీగా నిఖిల్‌ (Hero Nikhil) తాజా సినిమా ‘18 పేజెస్’ (18 Pages).. జీరో కట్స్ తో యూ/ఏ (U/A) సర్టిఫికెట్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!