‘కొండా’ సినిమాలో సురేఖమ్మ క్యారెక్టర్ చేయగలనని రాంగోపాల్ వర్మ (RGV) నమ్మడం నా అదృష్టం: ఇర్రా మోర్

Updated on Jun 19, 2022 08:30 AM IST
రాంగోపాల్‌ వర్మ (RGV), ఇర్రా మోర్, త్రిగుణ్
రాంగోపాల్‌ వర్మ (RGV), ఇర్రా మోర్, త్రిగుణ్

‘భైరవ గీత’, ‘డి -కంపెనీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఇర్రా మోర్‌.సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన కొండా సినిమాలో నటించింది. కొండా మురళి, సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో త్రిగుణ్‌కు జోడీగా నటించింది ఇర్రా మోర్.ఈనెల 23వ తేదీన కొండా సినిమా విడుదల కాబోతోంది.ఈ సందర్భంగా ఇర్రా మోర్‌‌ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

భైరవ గీత తర్వాత రెండు వెబ్‌ సిరీస్‌లు చేశాను. కరోనా లాక్‌డౌన్ సమయంలో రాంగోపాల్ వర్మ (RGV) ‘కొండా’ సినిమా స్క్రిప్ట్ పంపించారు. చదివిన తర్వాత బాగుందని అనిపించింది. అందులో సురేఖమ్మ క్యారెక్టర్‌‌ బాగా నచ్చింది. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న జీవితం ఆమెది. నటనకు ఆస్కారం ఉన్న క్యారెక్టర్. ఇంత పెద్ద క్యారెక్టర్‌‌ను నేను చేయగలనని రాంగోపాల్ వర్మ అనుకోవడం నా అదృష్టం.

రాంగోపాల్‌ వర్మ (RGV) ‘కొండా’ సినిమా పోస్టర్

ఇంటర్వ్యూలు చూశా..

కరోనా లాక్‌డౌన్ కావడంతో బయటకు వచ్చే చాన్స్ లేదు. దీంతో సినిమాకి ముందు సురేఖమ్మను వ్యక్తిగతంగా కలుసుకోలేకపోయాను. స్క్రిప్ట్‌ చదివిన తర్వాత యూట్యూబ్‌లో ఆవిడ ఇంటర్వ్యూలు చూశాను. ఇంట్లోనే ఆమెలా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలపై అవగాహన తెచ్చుకున్నాను. ఇంట్లోనే టెస్ట్‌ లుక్ చేసుకున్నాను. చీర కట్టుకున్నాను. సురేఖమ్మ రాజకీయాల్లో ఉన్నారు. ఆమె ఎటువంటి దుస్తులు వేసుకుంటారు. ఎటువంటివి వేసుకోవాలి? ఎటువంటివి వేసుకోకూడదు? అనే విషయాలను వర్మతో చర్చించి తెలుసుకున్నాను. సినిమాలో సురేఖమ్మను అనుకరించాలని అనుకోలేదు. నేనెలా ఉంటానో అలాగే నటించాను. ఆవిడ వ్యక్తిత్వం నా క్యారెక్టర్‌‌లో కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాను.

ఇర్రా మోర్

కామన్ పాయింట్‌ ఒకటి..

సురేఖమ్మ క్యారెక్టర్‌‌కీ నా జీవితానికి చాలా తేడా ఉంది. ఆవిడ చాలా స్ట్రాంగ్. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని ఆమె నిలబడ్డారు. నా జీవితం ఇప్పుడే మొదలైంది. అందుకే ఆమెతో ఏ విషయంలోనూ పోల్చుకోలేను. అయితే మా ఇద్దరి మధ్యా ఒక కామన్ పాయింట్ ఉంది. సురేఖమ్మ లాగానే నేను కూడా చాలా స్ట్రాంగ్. సురేఖమ్మ లాగా ఉండాలంటే ఏ నటికైనా కష్టమే. ఆమెలాగా ప్రజల గౌరవాన్ని పొందడం ముఖ్యం. కొండా సినిమా చూసిన తర్వాత సురేఖమ్మ లాగానే నన్ను కూడా ప్రేక్షకులు గౌరవిస్తారని అనుకుంటున్నాను. నటిగా అన్ని రకాల క్యారెక్టర్లు చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నానని.. రాంగోపాల్‌ వర్మ (RGV)కు థ్యాంక్స్ అని చెప్పింది ఇర్రా మోర్.

Read More: కొండా (Konda) ప్రీ రిలీజ్ వేడుక‌కు పొలిటిక‌ల్ లీడ‌ర్‌ను గెస్ట్‌గా ఆహ్మానించిన ఆర్జీవీ (RGV)

ఇర్రా మోర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!