డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీగా నిఖిల్‌ (Hero Nikhil) తాజా సినిమా ‘18 పేజెస్’ (18 Pages).. జీరో కట్స్ తో యూ/ఏ (U/A) సర్టిఫికెట్!

Updated on Dec 16, 2022 05:27 PM IST
‘18 పేజెస్’ (18 Pages) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబ‌ర్ 19న హైద‌రాబాద్‌లో చిత్రయూనిట్ ఘనంగా నిర్వ‌హించ‌బోతోంది.
‘18 పేజెస్’ (18 Pages) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబ‌ర్ 19న హైద‌రాబాద్‌లో చిత్రయూనిట్ ఘనంగా నిర్వ‌హించ‌బోతోంది.

టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కార్తికేయ‌-2’ త‌ర్వాత యంగ్ హీరో నిఖిల్‌ (Hero Nikhil), అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Anupama Parameswaran) జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం ‘18 పేజెస్’. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చ‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ ప‌తాకాల‌పై బ‌న్నీవాసు నిర్మిస్తున్నారు. ‘కుమారి 21F’ సినిమా ఫేమ్ దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాను యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో రూపొందించాడు. డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీకి కథను అందిస్తున్నారు.

‘18 పేజెస్’ (18 Pages) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబ‌ర్ 19న హైద‌రాబాద్‌లో చిత్రయూనిట్ ఘనంగా నిర్వ‌హించ‌బోతోంది. ఇక, ఈ వేడుక‌కు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఓ స్పెష‌ల్ వీడియో ద్వారా అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్న‌ట్లు అనౌన్స్ చేశారు. 

డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ‘18 పేజెస్’ (18 Pages) సినిమా డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ఇదివరకే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.  ఈ విషయాన్ని అఫిషియల్ గా పేర్కొంటూ చిత్రయూనిట్.. ఈ సినిమాకు జీరో కట్స్ తో సెన్సార్ పూర్తి అయ్యినట్టు పోస్టర్ తో రిలీజ్ చేశారు. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాపై మరింత ఆసక్తిగా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని దర్శకుడు పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో నిఖిల్ (Hero Nikhil), అనుపమల కాంబినేషన్ సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. వారి మధ్య వచ్చే రొమాంటిక్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని వారు చెబుతున్నారు.

Read More: నిఖిల్ (Nikhil) హీరోగా నటిస్తున్న ‘18 పేజెస్’ సినిమా రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!