కోలీవుడ్‌పై కోవిడ్ పంజా!.. చెన్నై ఆస్పత్రిలో చేరిన మణిరత్నం(Mani Ratnam)
ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) కు కోవిడ్ ఎటాక్ అయింది. కోవిడ్ కారణంగా మణిరత్నం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం మణిరత్నం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మణిరత్నం ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కోలీవుడ్ నటులు వరుసగా కోవిడ్ భారిన పడుతున్నారు.
గొప్ప దర్శకుడు మణిరత్నం
మణిరత్నం దర్శకత్వంలో ఎన్నో బ్లాక్ బాస్లర్ సినిమాలు తెరకెక్కాయి. దక్షిణాది చిత్రాలతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ డైరెక్టర్‌గా మారారు మణిరత్నం. రోజా, బొంబాయి సినిమాలతో భారతీయ సినీ రంగంలో కొత్త రికార్డులు సృష్టించారు. ప్రస్తుతం మణిరత్నం భారీ బడ్జెట్‌తో ‘పొన్నియన్ సెల్వన్ 1’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ‘పొన్నియన్ సెల్వన్ 1’ సెప్టెంబర్ 30న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యారాయ్, జయం రవి, కార్తి, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
చెన్నై ఆస్పత్రిలో మణిరత్నం
కోలీవుడ్‌లో కోవిడ్ విజృంభించింది. తమిళ దర్శకుడు మణిరత్నం కూడా కోవిడ్‌తో బాధపడుతున్నారు. కోవిడ్ 19 పాజిటివ్ ఉందని తెలియడంతో మణిరత్నం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం మణిరత్నం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. అనభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మణిరత్నానికి చికిత్స అందిస్తున్నారన్నారు.
మణిరత్నం నిర్మిస్తున్న 'పొన్నియన్ సెల్వన్ 1’ (Ponniyan Selvan) సినిమాపై విమర్శలు కూడా వచ్చాయి.
ఈ చిత్రంలో చోళరాజవంశం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ కోర్టులో కేసు నమోదయింది. హీరో విక్రమ్‌కు, దర్శకుడు మణిరత్నంకు నోటీసులు జారీ అయ్యాయి.
Read More: మణిరత్నం (Mani Ratnam) ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్