విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ‘లైగర్‌‌’ ఎఫెక్ట్‌!.. సోషల్‌ మీడియాకు బ్రేక్ ఇస్తున్నా: చార్మి కౌర్

Updated on Sep 04, 2022 05:25 PM IST
విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) - పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన లైగర్‌‌ సినిమా ఆగస్టు 25న రిలీజైంది
విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) - పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన లైగర్‌‌ సినిమా ఆగస్టు 25న రిలీజైంది

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) – పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'లైగర్‌'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్‌, బాలీవుడ్‌ ఇండస్ట్రీ హిట్స్‌లో ఒకటిగా లైగర్‌ నిలుస్తుందని అందరూ అనుకున్నారు.

అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ డిజాస్టర్‌ టాక్‌ని మూటగట్టుకుంది. మైక్‌టైసన్‌ వంటి ప్రపంచ చాంపియన్‌ ఉన్నా కంటెంట్‌ లేకుంటే థియేరట్లకు జనాలు రాబోరని లైగర్‌ సినిమా మరోసారి నిరూపించింది. ఫలితంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిందంటున్నారు సినీ విశ్లేషకులు.

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) - పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన లైగర్‌‌ సినిమా ఆగస్టు 25న రిలీజైంది

శాంతంగా ఉండండి..

లైగర్‌ డిజాస్టర్‌‌ తర్వాత నిర్మాతల్లో ఒకరైన చార్మి షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఆమె ట్వీట్‌ చేస్తూ ట్రోలర్స్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చారు. సోషల్‌ మీడియాకు టెంపరరీగా బ్రేక్‌ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘చిల్‌ గాయ్స్‌. కాస్త బ్రేక్‌ తీసుకుంటున్నా (సోషల్‌ మీడియాకు). పూరీ కనెక్ట్స్‌ త్వరలోనే మరింత స్ట్రాంగ్‌గా, ఇంతకుముందు కంటే ఉత్తమంగా తిరిగి వస్తుంది. అప్పటి వరకు కాస్త శాంతంగా ఉండండి అబ్బాయిలు’ అంటూ చార్మి ట్విట్టర్‌‌లో రాసుకొచ్చారు.

లైగర్‌ ఫ్లాప్‌తో హీరో విజయ్‌ దేవరకొండతోపాటు పూరీ కనెక్ట్స్‌ నిర్మాతలైన చార్మి, పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశించి నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్‌లో విజయ్‌ ఓవరాక్షన్‌, నోటి దురుసు వల్లే లైగర్‌‌ సినిమా ఫ్లాప్‌ అయ్యిందని, అతడిని నమ్ముకున్నందుకు పూరీ కనెక్ట్స్‌ పని అయిపోయిందంటూ సోషల్‌ మీడియా విమర్శలు చేస్తున్నారు. 

చార్మి, పూరీ కనెక్ట్స్‌ను ట్యాగ్‌ చేస్తూ సినిమా అసలు బాగాలేదని, విడుదలకు ముందు క్రియేట్‌ చేసిన హైప్‌ కథలో అసలే లేదని.. కథ, కథనం చాలా వీక్‌గా ఉన్నాయని విమర్శిస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లైగర్‌‌ సినిమాపై సోషల్‌ మీడియాలో వస్తున్న నెగిటివిటీ కారణంగానే చార్మి సోషల్‌ మీడియాకు బ్రేక్‌ తీసుకున్నారని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Read More : ఆ విషయంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘ఆచార్య’ను దాటేసిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘లైగర్’

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!