తెలుగు ప్రేక్షకులకు హ్యాట్సాఫ్.. మా ఊరి కథే ‘కాంతార’ (Kantara) కథ: దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty)

Updated on Oct 19, 2022 04:19 PM IST
‘కాంతార’ (Kantara) సినిమాలోని కంబళ సీక్వెన్స్ కోసం నెల రోజులు సాధన చేశానని హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) చెప్పారు
‘కాంతార’ (Kantara) సినిమాలోని కంబళ సీక్వెన్స్ కోసం నెల రోజులు సాధన చేశానని హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) చెప్పారు

కన్నడ నాట బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘కాంతార’ (Kantara) మూవీ తెలుగులోనూ సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన తొలి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. ఇప్పుడు రూ.25 కోట్ల మార్కును అందుకునే దిశగా పరుగులు తీస్తోంది. వీక్ డేస్‌లోనూ ‘కాంతార’ కలెక్షన్లలో పెద్దగా డ్రాప్ లేకపోవడం ట్రేడ్‌ను ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో ‘కాంతార’ టీమ్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. కార్యక్రమంలో ‘కాంతార’ను తెలుగులోకి విడుదల చేసిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్, హీరో రిషబ్ శెట్టి, హీరోయిన్ సప్తమి గౌడ (Sapthami Gowda) తదితరులు పాల్గొన్నారు. 

‘కాంతార’ సక్సెస్ మీట్‌లో రిషబ్ శెట్టి (Rishab Shetty) మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు సంతోషంగా ఉందని.. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదన్నారు. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ దక్కుతుండటంతో హ్యాపీగా ఉన్నానని రిషబ్ శెట్టి చెప్పారు. ఈ మూవీ దానంతట అదే పాన్ ఇండియా సినిమాగా మారిందన్నారు. మౌత్ టాక్‌తో ‘కాంతార’ ఈ స్థాయి విజయాన్ని సాధించిందన్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొచ్చినందుకు అల్లు అరవింద్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

‘కాంతారను తెలుగులో డబ్ చేసి, రిలీజ్ చేసేందుకు మాకు ఎక్కువ సమయం దొరకలేదు. రెండు వారాల వ్యవధిలోనే ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించాం. ఈ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. తెలుగు ఆడియెన్స్ అంటే మాకు చాలా ఇష్టం. వాళ్లు భాషా భేదాన్ని చూడకుండా ఇతర చిత్ర పరిశ్రమల నుంచి వచ్చే మంచి సినిమాలను ఆదరిస్తుంటారు. ‘కాంతార’ తెలుగు వెర్షన్ రిలీజైన మొదటి రోజే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో మా మూవీకి ఐదు రోజుల్లో రూ.20 కోట్లకు పైన కలెక్షన్లు రావడం షాకింగ్‌గా అనిపించింది. ఇది తెలుగు ప్రేక్షకులకు సినిమాల మీద ఉండే ఇష్టాన్ని, ప్రేమను సూచిస్తోంది. వారికి నా హ్యాట్సాఫ్’ అని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు. 

ప్రేక్షకుల నుంచి ఇలాంటి మద్దతు, ప్రేమ ఎప్పుడూ కొనసాగాలని కోరుకుంటున్నానని రిషబ్ శెట్టి అన్నారు. అప్పుడే మన సంస్కృతి, సంప్రదాయాలను మిళితం చేస్తూ మరిన్ని మంచి చిత్రాలను ఆడియెన్స్ ముందుకు తీసుకురావడం సాధ్యమవుతుందన్నారు. ‘కాంతార’ చిత్రంలో చూపిన భూత కోల సంప్రదాయాన్ని తమ కుటుంబం ఎన్నో ఏళ్లుగా పాటిస్తోందని రిషబ్ తెలిపారు. అది తమ సంప్రదాయమని.. దాన్ని గౌరవిస్తామని, నమ్ముతామని ఆయన చెప్పారు. ఈ సినిమా కథ తన ఊరి కథ అని.. చిన్నప్పటి నుంచి తాను చూస్తూ పెరిగిన విషయాలతోనే ‘కాంతార’ను రూపొందించానని పేర్కొన్నారు. ఈ సినిమా మొదట్లో చూపించిన కంబల యుద్ధ కళను కూడా తమ కుటుంబీకులు పాటిస్తుంటారని.. వారు పోటీల్లో పాల్గొంటారని రిషబ్ చెప్పుకొచ్చారు. కంబల సీక్వెన్స్ కోసం తాను నెల రోజు సాధన చేశానన్నారు. మూవీ క్లైమాక్స్‌లో భూత కోల సీన్స్ అంత బాగా రావడానికి తన కృషి తక్కువేనని.. అదంతా దైవకృప అని రిషబ్ వివరించారు. 

Read more: స్టార్లు, వీఎఫ్ఎక్స్ ఉంటే సరిపోదు.. ‘కాంతార’ (Kantara)ను చూసి నేర్చుకోవాలనంటున్న ఆర్జీవీ (Ram Gopal Varma)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!