రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan) రియ‌ల్ హీరో అంటున్న క‌మెడియ‌న్ స‌త్య‌

Updated on Jul 08, 2022 03:31 PM IST
రామ్ చ‌ర‌ణ్  (Ram Charan) రీల్ హీరో మాత్ర‌మే కాదు రియ‌ల్‌గా కూడా హీరోనే అంటున్నాడు క‌మెడియ‌న్ స‌త్య . 
రామ్ చ‌ర‌ణ్  (Ram Charan) రీల్ హీరో మాత్ర‌మే కాదు రియ‌ల్‌గా కూడా హీరోనే అంటున్నాడు క‌మెడియ‌న్ స‌త్య . 

టాలీవుడ్‌లో రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan)కు మంచి ఫాలోయింగ్ ఉంది. అభిమానుల‌తో పాటు సాటి న‌టీన‌టులు కూడా రామ్ చ‌ర‌ణ్ మంచివాడని చెప్తుంటారు. రామ్ చ‌ర‌ణ్ రీల్ హీరో మాత్ర‌మే కాదు రియ‌ల్‌గా కూడా హీరోనే అంటున్నాడు క‌మెడియ‌న్ స‌త్య. 

రామ్ చ‌ర‌ణ్‌కు సొంత జెట్ విమానం ఉంది. ఆ విమానంలో క‌మెడియ‌న్ స‌త్య రామ్‌తో దిగిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. రామ్ చ‌ర‌ణ్ సొంత ఫ్లైట్‌లో క‌మెడియ‌న్ స‌త్య ఎందుకున్నార‌నే  డౌట్ అంద‌రిలోనూ వ‌చ్చింది. 

రామ్ మంచి మ‌న‌సుకు ఫిదా
క‌మెడియ‌న్ స‌త్య 'స్వామిరారా' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప‌లు సినిమాల్లో క‌మెడియ‌న్‌గా వినోదం పంచారు స‌త్య‌. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్  RC15  షూటింగ్ అమృత్‌స‌ర్‌లో జ‌రుగుతుంది. ఆ షూటింగ్ షెడ్యూల్‌కు క‌మెడియ‌న్ స‌త్య కూడా హాజ‌ర‌య్యారు. రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) అమృత్ స‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చేట‌ప్పుడు త‌న సొంత విమానంలో స‌త్య‌ను కూడా తీసుకొచ్చారు. 

క‌మెడియ‌న్ స‌త్య, రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి స్పెష‌ల్ ఫ్లైట్‌లో అమృత్ స‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. రామ్ త‌న‌ను విమానంలో ఎక్కించుకోవ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని స‌త్య తెలిపారు. రామ్ రియ‌ల్ హీరో అంటూ ప్ర‌శంసించారు క‌మెడియ‌న్ స‌త్య. 

రామ్, ఉపాస‌న‌లది ఒక‌టే బాట‌
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) వ్య‌క్తిత్వం చాలా గొప్ప‌ది. ఇటీవలే అత‌ని కారు డ్రైవ‌ర్ బ‌ర్త్ డే వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. రామ్ చ‌ర‌ణ్‌ది చాలా మంచి మ‌న‌సంటూ నెటిజ‌న్లు ప్ర‌శంసించారు. ఇప్పుడు చిన్న క్యారెక్ట‌ర్ ఆరిస్టు స‌త్య‌ను త‌న సొంత విమానంలో ఎక్కించుకుని మ‌రోసారి త‌న మంచి మ‌న‌సును చాటుకున్నారు రామ్. రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కూడా ఇత‌రుల‌కు స‌హాయం చేయ‌డంలో ముందు వ‌రుస‌లో ఉంటారు. 

Read More: డ్రైవ‌ర్ బ‌ర్త్ ‌డే కోసం.. సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన రామ్ చరణ్ (Ram Charan), ఉపాస‌న‌ దంపతులు !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!