Chup: బాలీవుడ్‌పై ఫోక‌స్ చేసిన దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)!.. సీతారామం హిందీ వ‌ర్ష‌న్ రిలీజ్

Updated on Aug 26, 2022 05:35 PM IST
 ‘చుప్: ద రివెంజ్ ఆఫ్ ద ఆర్టిస్ట్’  సినిమాతో నార్త్ ప్రేక్ష‌కుల‌ను దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఎంట‌ర్‌ట్రైన్ చేయ‌నున్నారు.
‘చుప్: ద రివెంజ్ ఆఫ్ ద ఆర్టిస్ట్’  సినిమాతో నార్త్ ప్రేక్ష‌కుల‌ను దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఎంట‌ర్‌ట్రైన్ చేయ‌నున్నారు.

Chup: సౌత్ హీరో  దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) 'సీతారామం' సినిమా స‌క్సెస్‌తో దూసుకెళుతున్నారు. ఈ మ‌ల‌యాళీ హీరో నార్త్‌లోనూ త‌న స‌త్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ‘చుప్: ద రివెంజ్ ఆఫ్ ద ఆర్టిస్ట్’  సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. 'సీతారామం' హిట్‌తో దుల్క‌ర్‌కు ఫాలోయింగ్ పెరిగింది. 'సీతారామం' సినిమాను కూడా హిందీలో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. 

బాలీవుడ్‌లోకి ఎంట్రీ

కొత్త క‌థ‌ల‌తో హీరో దుల్కర్ సల్మాన్ ప్రేక్షకుల‌కు వినోదం పంచుతున్నారు. 'సీతారామం' చిత్రంలో దుల్క‌ర్ న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘చుప్: ద రివెంజ్ ఆఫ్ ద ఆర్టిస్ట్’  సినిమాతో నార్త్ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌ట్రైన్ చేయ‌నున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌కు జోడిగా సన్నీ డియోల్ న‌టిస్తున్నారు. ఆర్.బాల్కి డైరెక్షన్‌‌లో  ‘చుప్: ద రివెంజ్ ఆఫ్ ద ఆర్టిస్ట్’  తెర‌కెక్కింది. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 23న రిలీజ్ చేయ‌నున్నారు. 1959లో వచ్చిన ‘కాగజ్‌‌కే ఫూల్’ సినిమా ఆధారంగా ఈ సినిమాను చిత్రీక‌రించారు. 

అమితాబ్ మ్యూజిక్ 

‘కాగజ్‌‌కే ఫూల్’ సినిమా హీరో, ద‌ర్శ‌కుడుగురుదత్‌కు నివాళిగా ఈ సినిమాను చిత్రీక‌రించామ‌ని బాల్కి తెలిపారు. గురుదత్ జయంతి రోజున ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజ‌ర్ చూసిన బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ భావోద్వేగానికి లోన‌య్యారు. అప్ప‌టిక‌ప్పుడు ఓ పాట‌ను కంపోజ్ చేసి మ‌రీ చిత్ర యూనిట్‌కు అందించారు. త‌మ సినిమా కోసం అమితాబ్ మ్యూజిక్ కంపోజ్ చేయ‌డం ఆనందంగా ఉంద‌ని ద‌ర్శ‌కుడు బాల్కి తెలిపారు. ఎండ్ టైటిల్ టైంలో అమితాబ్ పాట‌ను ప్ర‌ద‌ర్శిస్తామ‌న్నారు. 

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) 'సీతారామం' హిందీ వ‌ర్ష‌న్  సెప్టెంబ‌ర్ 2న విడుద‌ల చేయ‌నున్నారు.

సీతారామం హిందీ వ‌ర్ష‌న్ రిలీజ్

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో విడుద‌లైన 'సీతారామం' (Sita Ramam) బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను హిందీలోనూ విడుద‌ల చేయ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 2న 'సీతారామం' హిందీ వ‌ర్ష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

Read More: చూడ చ‌క్క‌ని దృశ్య కావ్యం 'సీతారామం' (Sita Ramam) - మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!