యూట్యూబ్‌లో చిరంజీవి (Chiranjeevi) దివాళీ థమాకా! 3 రోజులు.. 10 మిలియన్ వ్యూస్‌తో ‘వాల్తేరు వీరయ్య’ రికార్డు

Updated on Oct 27, 2022 04:22 PM IST
గాడ్‌ఫాదర్‌‌ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య టైటిల్‌ టీజర్‌‌ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది
గాడ్‌ఫాదర్‌‌ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య టైటిల్‌ టీజర్‌‌ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని జానర్‌‌ సినిమాల్లోనూ నటించిన ప్రేక్షకులను అంతలా మెప్పించారు ఆయన. గాడ్‌ఫాదర్ సినిమాతో దసరా పండుగకు సినీ ప్రేమికులను ఫిదా చేసిన చిరు.. దీపావళి పండుగ రోజు తన 154వ సినిమా టైటిల్ టీజర్‌‌ విడుదల చేసి సందడి చేశారు.

దీపావళి పండుగ అయ్యి మూడు రోజులు గడిచింది. పండుగ హడావిడి ముగిసింది. అయితే దీపావళి సందర్భంగా చిరంజీవి 154వ సినిమా వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్‌‌ విడుదలైంది. దాని సందడి మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. 3 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్‌ సాధించి రికార్డు సృష్టించింది. అంతేకాదు యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో కూడా నంబర్‌‌1 స్థానంలో నిలిచింది. మాస్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమాలో చాలాకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాస్ గెటప్‌లో కనిపించడంతో అభిమానులు ఫిదా అయ్యారు. 

గాడ్‌ఫాదర్‌‌ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య టైటిల్‌ టీజర్‌‌ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది

మాస్‌, గ్రేస్‌, స్టైల్‌కు..

దీపావళి కానుకగా విడుదలైన "వాల్తేరు వీరయ్య" టైటిల్ టీజర్‌‌  యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటివరకు యూట్యూబ్‌లో ఈ సినిమా టీజర్‌‌ను పది మిలియన్ల మందికిపైగా వీక్షించారు. గడిచిన రెండు రోజులుగా యూట్యూబ్‌లో నంబర్1 పొజిషన్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది వాల్తేరు వీరయ్య టీజర్. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమాలోని మరో కీలకపాత్రలో మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్నారు.

శృతిహాసన్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. టైటిల్‌ టీజర్‌‌లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌‌కు కూడా అభిమానులు ఫిదా అవుతున్నారు.  వాల్తేరు వీరయ్య సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దసరా పండుగకు గాడ్‌ఫాదర్‌‌ సినిమాతో పలకరించిన చిరంజీవి (Chiranjeevi).. వచ్చే ఏడాది సంక్రాంతికి మరోసారి థియేటర్లలో ప్రేక్షకులకు మాస్‌ ఫీస్ట్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. వాల్తేరు వీరయ్య టీజర్‌‌లో చిరంజీవి మాస్, స్వాగ్ లుక్‌కు పలువురు నెటిజన్ల రియాక్షన్లతో రూపొందించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

Read More : చిరు (Chiranjeevi Konidela) సినిమా వెయ్యి కోట్లు రాబట్టాలి.. అదే ఆయన ఇమేజ్‌కు తగిన చిత్రం: తమ్మారెడ్డి భరద్వాజ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!