మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)పై అభిమానాన్ని చాటుకున్న స్టూడెంట్స్.. వీడియో షేర్ చేసిన డైరెక్టర్ బాబి!
అభిమానులే తనకు గాడ్‌ఫాదర్స్ అని ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌లో చెప్పారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తున్నారు చిరంజీవి. చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమా దసరా పండుగకు విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
గాడ్‌ఫాదర్ సినిమాలో చిరు వింటేజ్ లుక్ మెగాఫ్యాన్స్‌కు ఒక రేంజ్‌లో నచ్చేసింది. గాడ్‌ఫాదర్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు మాస్ గెటప్‌లో అదరగొడుతున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ రిలీజ్ టీజర్ రికార్డులు సృష్టిస్తూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
గాడ్‌ఫాదర్ సినిమా సక్సెస్‌తో ఆనందంలో ఉన్నారు మెగాస్టార్, ఆయన అభిమానులు. అభిమానులను అలరించడమే తన లక్ష్యం అని, దాని కోసం ఎంతైనా కష్టపడతానని చెప్పే మెగాస్టార్‌కు అభిమానులు తమవంతు గిఫ్ట్ ఇచ్చారు. మెగాస్టార్ రేంజ్‌కు సరిపోయేలా మెగాట్రిబ్యూట్ ఇచ్చారు. ఈ ట్రిబ్యూట్ చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన నటుడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌కు మురిసిపోతున్నారు.
డ్రోన్ కెమెరాతో..
దాదాపు 6 వేల మంది స్టూడెంట్స్ కలిసి కాలేజ్ గ్రౌండ్‌లో మెగాస్టార్ రూపం వచ్చేలా కూర్చున్నారు. దీనిని డ్రోన్ కెమెరాలో బంధించి నెట్‌లో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని డైరెక్టర్ బాబి ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది. రాజమండ్రిలో జరుగుతున్న షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మాస్ మహారాజా రవితేజ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.
Read More : యూట్యూబ్‌లో చిరంజీవి (Chiranjeevi) దివాళీ థమాకా! 3 రోజులు.. 10 మిలియన్ వ్యూస్‌తో ‘వాల్తేరు వీరయ్య’ రికార్డు