Chandramukhi 2 Update: ‘చంద్ర‌ముఖి 2’ నుంచి క్రేజీ అప్‌డేట్.. షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి!

Updated on Aug 09, 2022 09:40 PM IST
రాఘవ లారెన్స్ (RaghavaLawrence) ముని, కాంచన, గంగ వంటి హర్రర్ చిత్రాలతో ఆకట్టుకోగా.. ‘చంద్రముఖి2’ (Chandramukhi2)పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రాఘవ లారెన్స్ (RaghavaLawrence) ముని, కాంచన, గంగ వంటి హర్రర్ చిత్రాలతో ఆకట్టుకోగా.. ‘చంద్రముఖి2’ (Chandramukhi2)పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

త‌మిళ ద‌ర్శ‌కుడు పి వాసు (P Vasu) ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా ప్రాజెక్టు చంద్ర‌ముఖి2 (Chandramukhi 2). ఈ సినిమాలో తమిళ నటుడు రాఘవా లారెన్స్ (Raghava Lawrence) ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ (Lyca Productions) నిర్మిస్తోంది. ల‌క్ష్మీ మీన‌న్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో క‌నిపించ‌బోతుంది. ఈ చిత్రానికి ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తుండ‌గా.. తోట తరణి ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. 

హార్రర్ జోన‌ర్‌లో వ‌చ్చి బ్లాక్ బాస్ట‌ర్ హిట్టుగా నిలిచిన చంద్ర‌ముఖికి సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. రజినీకాంత్ (Rajinikanth), జ్యోతికా, నయనతార కలిసి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఇప్పటికీ  ప్రేక్షకులు మరిచిపోలేదు. అయితే ఇదే జోనర్ లో ఆడియెన్స్ ను మరింతగా అలరించేందుకు దీనికి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు పి వాసు (P Vasu).  

గతంలో లారెన్స్ తో 'శివలింగ' చేసి ఉన్న వాసు.. 'చంద్రముఖి 2' (Chandramukhi 2) సినిమా కోసం కూడా ఆయననే ఎంచుకున్నాడు. లారెన్స్ నేరుగా రజనీ దగ్గరికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకుని షూటింగుకు వెళ్లడం తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ ను మైసూర్ లో ప్లాన్ చేశారు. లారెన్స్ తో పాటు ముఖ్య పాత్రధారులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ మేజర్ షెడ్యూల్ షూటింగ్ నిన్నటితో ముగిసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

'చంద్రముఖి 2' చిత్రంలో సపోర్టింగ్ క్యారెక్టర్ లో ప్రముఖ కమెడియన్ వడివేలు నటిస్తున్నారు. అలాగే రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ముని, కాంచన, గంగ వంటి హర్రర్ చిత్రాలతో ఆకట్టుకోగా.. ‘చంద్రముఖి 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read More: 'చంద్రముఖి 2' లో హీరోగా రాఘవ లారెన్స్ (Raghava Lawrence) .. ఏకంగా 5 మంది హీరోయిన్లు?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!