Samantha : మరో సినిమాకు సమంత గ్రీన్‌సిగ్నల్‌! దర్శకుడు ఎవరో తెలుసా?

Updated on Nov 17, 2022 06:03 PM IST
సమంత (Samantha) నటించిన యశోద సినిమా ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది
సమంత (Samantha) నటించిన యశోద సినిమా ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది

స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha)  ‘మయోసైటిస్‌’కు చికిత్స తీసుకుంటూనే ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. యశోద అందించిన విజయం తర్వాత సమంత మరో చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లోని టాలెంటెడ్‌ హీరోయిన్స్‌లో ముందువరుసలో ఉంటారు సమంత.  ఆమె నటించిన యశోద సినిమా ఇటీవలే తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకాదరణ పొందుతోంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది.

సరోగసి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు సమంత. సమంత నటించబోయే తర్వాతి సినిమా గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. యశోద సక్సెస్‌ తర్వాత సామ్‌ మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ సమంతకు ఓ స్టోరీ లైన్‌ వినిపించారని టాక్. అది ఆమెకు బాగా నచ్చిందని, దాంతో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కథను ముందుగా రష్మికా మందానకు వినిపించారని, అయితే కొన్నికారణాల వల్ల ఆమె ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించలేదని సమాచారం. దీంతో రాహుల్‌ కథలో కొన్ని మార్పులు చేసి సమంతకు చెప్పగా ఆమె వెంటనే ఓకే చేశారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అటు రాహుల్‌, ఇటు సమంత ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. ప్రస్తుతం సమంత (Samantha) సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో లవ్‌ ఎంటర్‌‌లైనర్‌‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.  

Read More : Yashoda Movie Review : సమంత నటనా విశ్వరూపాన్ని చూపించిన "యశోద" !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!