దక్షిణాది సినిమాలపై మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) కామెంట్స్ వైరల్
సౌత్ సినిమాలపై బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు ఉత్తరాదిలో కూడా సూపర్ హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే .
అవి ప్రస్తుతం బాలీవుడ్ దర్శకనిర్మాతలకు నిద్రలేకుండా చేస్తున్నాయని అంటున్నాడు మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee). కరోనా వ్యాప్తి నుంచి ప్రపంచం బయటపడిన వెంటనే వచ్చిన ‘పుష్ప’ హిందీ డబ్బింగ్ వెర్షన్ బాలీవుడ్‌లో ఏకంగా రూ.106 కోట్ల గ్రాస్ సాధించింది.
దాని తర్వాత వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 సునాయాసంగా చెరో రూ.300 కోట్లు రాబట్టాయి. అయితే బాలీవుడ్ సినిమాలు మాత్రం వంద కోట్లు వసూలు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాయి.
తాజాగా మీడియాతో మాట్లాడుతూ మనోజ్ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. "ఇటీవల కాలంలో చాలా బ్లాక్‌బస్టర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వందల కోట్ల వసూళ్లు రాబడుతున్నాయి. ఆ కలెక్షన్లు చూసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు భయపడిపోతున్నారు. వాళ్ల వెన్నులో వణుకు పుడుతోంది. ఏం చేయాలో కూడా వాళ్లకు తెలియడం లేదు. అయితే అది కూడా ఒక విధంగా మంచిదే. ఇదో గుణపాఠం నేర్పింది. ఎంతోకొంత దీని నుంచి ఇండస్ట్రీ నేర్చుకోవాలి. సౌత్ వాళ్లు సినిమాపై ప్యాషన్‌తో పనిచేస్తారు.
ప్రతి సన్నివేశాన్ని బెస్ట్‌గా ఉండాలనే తపనతో తెరకెక్కిస్తారు. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 సినిమాల్లో ఎటువంటి లోటుపాట్లు లేవు. ప్రతి సీన్ క్లీన్‌గా ఉంది. సినిమాపై ఉన్న తపన మనకు ప్రతి సీన్‌లో కనిపిస్తుంది. ఈ ప్యాషన్ హిందీ ఇండస్ట్రీలో లేదు. బాక్సాఫీస్ కలెక్షన్ల గురించే ఆలోచిస్తున్నాం తప్పితే.. మనల్ని మనం విమర్శించుకోవడం లేదు. కాగా, ఇటీవలే రిలీజ్ అయిన పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్2 సినిమాలు పాన్ ఇండియా లెవల్‌లో రిలీజై కలెక్షన్ల రికార్డులు కురిపించాయన్న సంగతి తెలిసిందే.