దేవి శ్రీ ప్రసాద్‌కు భయపడుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్.. కారణం ఏంటంటే?

Updated on Jul 17, 2022 12:27 AM IST
అల్లు అర్జున్ (Allu Arjun),  దేవి శ్రీ ప్రసాద్
అల్లు అర్జున్ (Allu Arjun), దేవి శ్రీ ప్రసాద్

పుష్ప సినిమాతో ఆలిండియా రేంజ్‌లో క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ అయిన పుష్ప సినిమా  బ్లాక్‌బస్టర్ హిట్‌ అయ్యింది. ఆ సినిమాలో అల్లు అర్జున్‌ నటనకు ఫ్యాన్స్‌తోపాటు సినీ ప్రేమికులు కూడా ఫిదా అయ్యారు.

ప్రస్తుతం బన్నీ పుష్ప2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చిన నేపథ్యంలో పుష్ప2 సినిమాను అదిరిపోయేలా తెరకెక్కిస్తున్నారని టాక్. ఇక, పుష్ప సినిమాకు క్రేజ్ రావడానికి సుకుమార్ దర్శకత్వం, అల్లు అర్జున్‌ నటన ఎంతగా దోహదపడ్డాయో.. దేవి శ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం అంతే తోడ్పడింది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. పుష్ప సినిమాలో ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. యూట్యూబ్‌తోపాటు సోషల్ మీడియాలో కూడా లక్షల వ్యూస్‌ సాధించాయి.

అల్లు అర్జున్ (Allu Arjun)

ఆ రేంజ్ హిట్‌ లేదనే..

పుష్ప సినిమాలోని పాటలకు వచ్చిన క్రేజే ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులను భయపెడుతోంది. పుష్ప సినిమా తర్వాత దేవి శ్రీ ప్రసాద్‌ చేసిన పాటలకు ఆ రేంజ్‌లో క్రేజ్ రాలేదు. రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ది వారియర్’ సినిమాలోని ‘బులెట్‌’ పాట మినహా మరో పాట ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. అంతేకాదు.. ది వారియర్ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా అంత ఎగ్జైటింగ్‌గా లేదని అభిప్రాయపడుతున్నారు కొందరు.

ఈ క్రమంలో పుష్ప2 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ఎలాంటి మ్యూజిక్ అందిస్తారోనని బన్నీ అభిమానులు భయపడుతున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) ఎంత బాగా నటించినా.. సుకుమార్ సినిమాను ఎంత భారీగా తెరకెక్కించినా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సరిగ్గా లేకపోతే సినిమాకు మైనస్ అవుతుందని అనుకుంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మార్క్ మ్యూజిక్ ఇచ్చి.. పుష్ప2 సినిమాలో పాటలను పుష్ప సినిమాలో పాటలకు మించి మ్యూజిక్ అందిస్తారా లేదా చూడాలి.

Read More : మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘పొన్నియిన్ సెల్వన్‌’ (Ponniyin Selvan) సినిమాలో ఒక్క పాటకు అంత మంది డ్యాన్సర్లా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!