Alia Bhatt: ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక షూటింగ్ లో పాల్గొన్న అలియా భట్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!

Updated on Jul 10, 2022 09:39 PM IST
అలియా భట్ (Alia Bhatt)
అలియా భట్ (Alia Bhatt)

బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ (Ranbir Kapoor) దాదాపు ఆరేళ్ల ప్రేమాయణం తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ లో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన రెండు నెలలకే అలియా ప్రెగ్నన్సీ న్యూస్ చెప్పి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు.

ఈ హీరో హీరోయిన్లకు పెళ్లి అయిందన్న సంతోషంలో ఉండగా పెళ్లయిన రెండు నెలలకే ఆలియా భట్ (Alia Bhatt Pregnancy) ప్రెగ్నెన్సీ అంటూ మరొక శుభవార్త చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఈ ప్రెగ్నెన్సీ విషయంలో పలువురు ఆమెను విమర్శించిన విషయం కూడా తెలిసిందే. కాగా ప్రెగ్నెన్సీ కారణంగా షూటింగ్ లకు బ్రేక్ ఇవ్వకుండా పెళ్లికి ముందు కమిట్ అయిన సినిమాలను చేస్తూ వెళ్తోంది. 

ఇక అలియా భట్ హాలీవుడ్‌ మూవీ 'హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌'లో (Heart of Stone) నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అలియాకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. అయితే ఇంతకుముందు పోర్చ్‌గల్‌లోని ఎడారిలో షూటింగ్‌ చేసినప్పుడు కొంతమంది ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ లీకైన ఫొటోలలో అలియా భట్‌ బేబీ బంప్‌ స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. 

అయితే షేర్ చేసిన ఆ ఫోటోలలో ఆమె తన బేబీ బంప్‌ (Alia Bhatt Baby Bump) కవర్‌ అయ్య విధంగా బ్లాక్‌ జాకెట్‌ ధరించిందని కామెంట్లు పెడుతున్నారు.షూటింగ్‌ పూర్తియిన సందర్భంగా హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌ చిత్రబృందానికి అలియా భట్ థ్యాంక్స్‌ చెప్పిందట. హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ గాల్‌ గాడోట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!