Aamir Khan: విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ అనూహ్య నిర్ణయం.. సినిమాలకు బాలీవుడ్ స్టార్ హీరో బిక్ బ్రేక్..! 

Updated on Nov 16, 2022 03:39 PM IST
‘ఛాంపియన్స్’ (Champions Movie) చిత్రంలో తన స్థానంలో నటించాల్సిందిగా మరో స్టార్ హీరోను కోరతానని ఆమిర్ ఖాన్ (Aamir Khan) స్పష్టం చేశారు
‘ఛాంపియన్స్’ (Champions Movie) చిత్రంలో తన స్థానంలో నటించాల్సిందిగా మరో స్టార్ హీరోను కోరతానని ఆమిర్ ఖాన్ (Aamir Khan) స్పష్టం చేశారు

బాలీవుడ్ బిగ్ స్టార్లలో ఆమిర్ ఖాన్ (Aamir Khan) ఒకరు. ఖాన్ త్రయంలో ఒకడిగా ఎంతోమంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. సల్మాన్, షారుఖ్‌లకు భిన్నంగా విలక్షణమైన నటనతో ఆకట్టుకోవడం ఆమిర్ ప్రత్యేకత అని చెప్పాలి. కథలను ఎంచుకోవడంలోనూ ఆమిర్ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తారు. అది ఆయన నటించిన సినిమాల్లో ప్రతిబింబిస్తుంది. స్టోరీ సెలెక్షన్‌లో ఆమిర్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారని అంటుంటారు. 

కథను ఎంచుకోవడంతోపాటు సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆమిర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. తాను అనుకున్న అవుట్‌పుట్ వచ్చే వరకు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. డైరెక్టర్ ఏం చెప్పాడో.. అది తెరపై చూపించేంత వరకు ఆమిర్ అస్సలు ఒప్పుకోరని అంటుంటారు. అందుకే ఆయనకు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనే పేరుంది. ఆమిర్ కూడా ఒక్కో చిత్రానికి ఏళ్లకు ఏళ్లు టైమ్ తీసుకుంటారు.  

సినిమా సక్సెస్ అయితే ఎవ్వరూ ఏమీ అనరు. కానీ అదే మూవీ ఫెయిలైతే మాత్రం అందరూ వేలెత్తి చూపిస్తారు. ‘దంగల్’, ‘పీకే’ లాంటి చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టి బాలీవుడ్ హీరోల్లో టాప్ రేంజ్‌కు చేరుకున్నారు ఆమిర్. అయితే ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలతో తనపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను ఆయన నిలబెట్టుకోలేకపోయారు. ముఖ్యంగా ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ కావడం ఆమిర్‌ను బాగా నిరాశపర్చింది.

తాను అనుకున్న అవుట్‌పుట్ వచ్చే వరకు ఆమిర్ అస్సలు కాంప్రమైజ్ అవ్వరు

‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh Chaddha) ఫ్లాప్ తర్వాత చాన్నాళ్లకు మీడియా ముందుకు వచ్చారు ఆమిర్. ఆయన కొన్ని షాకింగ్ విషయాలను చెప్పారు. నటనకు కొంతకాలం విరామం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ‘నేను నటించడం మొదలుపెట్టి 35 సంవత్సరాలైంది. ఇన్నేళ్లలో ఏదో నష్టపోయానని అనిపిస్తోంది. అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకోవాలనుకుంటున్నా. మా అమ్మ, పిల్లలతో గడపాలనుకుంటున్నా. ఇన్నేళ్లు నిరంతరం పని గురించే ఆలోచించా. అది సరైంది కాదనిపిస్తోంది. అందుకే ఏడాదిన్నర పాటు కెమెరా ముందుకు రాకూడదని అనుకుంటున్నా’ అంటూ అనూహ్య నిర్ణయాన్ని ఆమిర్ ప్రకటించారు. 

ఇక ఆమిర్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్స్‌’ (Champions Movie). ఈ సినిమా గురించి స్పష్టత ఇస్తూ..‘ఛాంపియన్స్ చిత్రానికి నేను హీరోను మాత్రమే కాదు.. నిర్మాతను కూడా. కాబట్టి నేను నటించకపోయినా నిర్మాతగా ఉంటా. మరొక టాప్‌ హీరోను ఈ మూవీలో నటించమని కోరతా. ప్రస్తుతానికి నేను నా కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలి’ అని ఆమిర్ ఖాన్ సమాధానమిచ్చారు. 

Read more: బాలయ్య (Balakrishna) సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్!.. నందమూరి నటసింహంతో అర్జున్ రాంపాల్ (Arjun Rampal) ఢీ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!