Janhvi Kapoor: షాపింగ్ మాల్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సూపర్ డ్యాన్స్.. వీడియో వైరల్!

Updated on Jun 03, 2022 05:09 PM IST
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటూ దూసుకుపోతోంది. చూపు తిప్పుకోకుండా చేయగల గ్లామర్, అబ్బురపరిచే యాక్టింగ్‌తో తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఫలితంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోంది. 

దీంతో తన మార్కెట్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం భారీగా పెంచుకుంటోంది.  హాట్ నెస్ కే చెమటు పట్టించేంత హాట్ గా తయారవుతోంది. వయ్యారాలు ఒలకబోస్తూ.. సోగసులు ఆరబెడుతూ.. కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తోంది బాలీవుడ్ (Bollywood) బ్యూటీ. బాబోయ్ ఇంత హాట్ నెస్ తట్టుకోవడం మావల్ల కాదు అంటున్నారు నెటిజన్లు. నిజంగా అతిలోక సుందరి వారసురాలు అనిపించు కుంటుంది  జాన్వీ కపూర్. అందాలు ఆ ర బోయడంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు హాట్ నెస్ తో చంపేస్తోంది. 

అయితే, ఇటీవల వెకేషన్ కు వెళ్లిన జాన్వీ.. అక్కడ ప్రకృతి అందంతో కలిసి పోయి.. మరింత అందంగా కనిపిస్తోంది. చూపించి చూపించకుండా ఎద అందాలను అందిస్తున్నట్టు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇచ్చిన ఫోజులకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఈ అమ్మడి అందాలకు టీనేజర్లకు సమ్మర్ లో హాట్ స్టోక్ బదులుగా బ్యూటీ స్టోక్ తగిలేలా ఉంది. అంతలా జాన్వీ అందాల ప్రదర్శకు ముగ్ధులవుతున్నారు నెటిజన్లు. ఏం అందంరా బాబు అనుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ 'ది పంజాబ్బన్' సాంగ్‌ కు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ను ఇన్ స్టాగ్రామ్ లో ట్యాగ్ చేస్తూ, 'జగ్ జగ్ జీయో' మూవీలోని తన కొత్త పాటకు హుక్ స్టెప్ వేయమని జాన్వీకి ఛాలెంజ్ చేయగా.. జాన్వీ కపూర్ తన సరదా వీడియోను పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ వీడియోకు జాన్వీ #JugJugJeeyo, #nachpunjaban, #famstep అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జోడించింది. 

ఈ సాంగ్ కు స్టెప్పులు వేయాలంటూ జాన్వీ మరికొందరికి ఈ డాన్స్ ఛాలెంజ్ చేసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరోవైపు ఈ సాంగ్ కు హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), బాలీవుడ్ హీరోయిన్‌ అనన్య పాండేలు సైతం అదిరిపోయే హుక్‌ స్టేప్‌ వేసి సోషల్‌ మీడియాలో దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరి డ్యాన్స్ కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు విజయ్‌ ఫ్యాన్స్‌, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ది పంజాబ్బన్ సాంగ్‌ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

Read More: Shruti Hassan: ప్రేమ, అఫైర్లు, డేటింగ్ విషయాలపై ఓపెన్ అయిన శృతి హాసన్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!