Taapsee Pannu : 'తాప్సీ' బర్త్ డే స్పెషల్.. ఈ సోగ కళ్ల సుందరి సినీ ప్రయాణం ఎలా సాగిందో మనమూ తెలుసుకుందామా !

Updated on Aug 01, 2022 06:26 PM IST
రిషి కపూర్-అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాలతో స్క్రీన్ షేర్‌ చేసుకున్న తాప్సీ (Taapsee) గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
రిషి కపూర్-అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాలతో స్క్రీన్ షేర్‌ చేసుకున్న తాప్సీ (Taapsee) గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది హీరోయిన్ తాప్సీ (Tapsee). హీరోయిన్ తాప్సి 'ఝుమ్మంది నాదం' సినిమాతో మొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో భారీ కమర్షియల్ సినిమాలలో నటించినా కూడా, అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ బడా హీరోలతో వరుసగా నటించే అవకాశాలను మాత్రం దక్కించుకుంది.  

చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ తెచ్చుకున్న తాప్సీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా రిషి కపూర్ నుంచి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వరకూ బడా  దిగ్గజాలతో స్క్రీన్ షేర్‌ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను మనమూ తెలుసుకుందాం.

 

హీరోయిన్ తాప్సి (Heroine Tapsee)

తాప్సీ వర్థమాన సినీ నటి. 'ఝుమ్మందినాదం' (Jhummandi Nadam Movie) చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. నటన రంగంలోకి రాకముందు, ఈ బ్యూటీ మోడలింగ్ చేసేది. ఈమె స్వస్థలం ఢిల్లీ కావడంతో అక్కడే స్థిరపడింది. ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తాప్సీ తల్లి నిర్మల్జీత్ గృహిణి. ఇక తండ్రి ఆర్థిక లావాదేవీల నిపుణుడిగా సేవలందిస్తున్నారు. 

ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి, కథానాయికగా అత్యున్నత స్థానానికి చేరుకున్న తాప్సీ, ఇటీవలే మరో కొత్త అవతారమెత్తడానికి సిద్ధమైంది. నిర్మాతగానూ తన లక్‌ను పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే ‘అవుట్‌ సైడర్‌ ఫిలింస్‌’ (Outsider Films) పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించింది ఈ బ్యూటీ. ప్రంజల్‌ ఖాందియాతో కలిసి తాప్సీ ఇక నుండి సినిమాలు కూడా నిర్మించనుంది. ఈ విషయాన్ని తాప్సీ ఆ మధ్య ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించడం విశేషం. 


 

హీరోయిన్ తాప్సి (Heroine Tapsee)

2010 సంవత్సరంలో సినిమా కెరీర్‌ను ప్రారంభించిన తాప్సీ.. తెలుగులోనే కాకుండా అనేక ఇతర దక్షిణాది భాషా చిత్రాలలోనూ నటించింది. ఇక 2013 సంవత్సరంలో 'చష్మే బద్దూర్‌' (chashme baddoor) సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాప్సీ 8 సంవత్సరాల వయస్సు నుంచే భరతనాట్యం నేర్చుకుంది. అంతేకాదు, ఆమె ప్రొఫెషనల్ శిక్షణ పొందిన స్క్వాష్ క్రీడాకారిణి కావడం విశేషం. 

ఇక, స్వస్థలం ఢిల్లీలోనే ఎక్కువగా చదువుకున్న తాప్సీ (Tapsee) కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందింది. ఆ తర్వాత ఈ అందాల భామ సాఫ్ట్‌‌వేర్‌ ఇంజినీర్‌గా పలు ఐటీ దిగ్గజ కంపెనీల్లో విధులు నిర్వర్తించింది. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే మోడలింగ్‌పై మక్కువ పెంచుకుంది. ఆపై సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

 

తాప్సీ ఇటీవలే 'శభాష్ మిథు' (Shabaash Mithu) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. క్రికెట్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.

ఏదేమైనా.. తాప్సీ అనతి కాలంలో దక్షిణాది సినిమాలతో పాటు, బాలీవుడ్ సినిమాల ద్వారా కూడా పాపులారిటీ దక్కించుకున్న కథానాయికగా వార్తలలో నిలవడం విశేషమే కదా. 

Read More: 'రష్మిక నా డార్లింగ్‌ అంటున్న విజయ్'.. అసలు విషయం బయటపెట్టిన అనన్య పాండే(Ananya Pandey)..!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!