బింబిసార (Bimbisara) సీక్వెల్‌లో నా త‌మ్ముడు ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుంది : క‌ల్యాణ్ రామ్

Updated on Jul 05, 2022 03:39 PM IST
బింబిసార (Bimbisara) చిత్రాన్ని నాలుగు భాగాలుగా తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నామ‌ని క‌ల్యాణ్ రామ్ చెప్పారు.
బింబిసార (Bimbisara) చిత్రాన్ని నాలుగు భాగాలుగా తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నామ‌ని క‌ల్యాణ్ రామ్ చెప్పారు.

Bimbisara: టాలీవుడ్ హీరో క‌ల్యాణ్ రామ్ ( Kalyan Ram) 'బింబిసార' అనే స‌రికొత్త క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఇటీవ‌లే ఎన్టీఆర్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా క‌ల్యాణ్ రామ్ 'బింబిసార' పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.ఈ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. మ‌గ‌ధ రాజు బింబిసారుడిగా నందమూరి క‌ల్యాణ్ రామ్ వెండితెర‌పై తన అభిమానులకు కనువిందు చేయనున్నారు.

తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు, ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో క‌ల్యాణ్ రామ్ ఎన్టీఆర్ గురించి చెప్పిన విష‌యాలు అందరికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించాయి.

క‌థ కోసం బ‌డ్జెట్‌ : క‌ల్యాణ్ రామ్
బింబిసార (Bimbisara) చిత్రాన్ని స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి, జగదేక వీరుడు లాంటి సినిమాల స్పూర్తితో తీశామ‌ని క‌ల్యాణ్ రామ్ తెలిపారు. అవెంజర్స్ సినిమాలు ఎలాంటి థ్రిల్‌ను ఇస్తాయో.. బింబిసార సినిమా చూస్తే అలాంటి అనుభూతే క‌లుగుతుంద‌న్నారు. ఈ సినిమా విషయంలో అసలు బడ్జెట్ గురించి ప‌ట్టించుకోలేద‌న్నారు. బింబిసార క‌థ‌ను అద్భుతంగా తెర‌కెక్కించామ‌ని క‌ల్యాణ్ రామ్ తెలిపారు

 

బింబిసార (Bimbisara) చిత్రాన్ని నాలుగు భాగాలుగా తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నామ‌ని క‌ల్యాణ్ రామ్ చెప్పారు.

సీక్వెల్స్‌లో ఎన్టీఆర్‌ (NTR) నటిస్తారా?
బింబిసార (Bimbisara) చిత్రాన్ని నాలుగు భాగాలుగా తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నామ‌ని క‌ల్యాణ్ రామ్ చెప్పారు. ద‌ర్శ‌కుడు వశిష్ట్ తాజాగా త‌న‌కు ఓ క‌థ‌ను వినిపించారన్నారు. ఈ కథకు అనుగుణంగానే బింబిసార సీక్వెల్స్‌ను కూడా తెర‌కెక్కిస్తామ‌న్నారు. ఈ చిత్రాన్ని ఏకంగా నాలుగు భాగాలుగా తీయాలని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అలాగే, బింబిసార‌కు సీక్వెల్‌గా నిర్మించ‌బోయే సినిమాల్లో త‌న త‌మ్ముడు ఎన్టీఆర్ న‌టించే అవ‌కాశం కూడా ఉందన్నారు కళ్యాణ్ రామ్. బింబిసార సీక్వెల్స్‌పై త్వ‌ర‌లోనే అన్ని విష‌యాలు వెల్ల‌డిస్తామ‌ని కూడా పేర్కొన్నారు.

మ‌గ‌ధ‌రాజు బింబిసారుడి చ‌రిత్ర‌
మ‌గ‌ధ‌రాజు బింబిసారుడి క‌థ ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.  బింబిసారుడు చిన్న వ‌య‌సులోనే చక్రవర్తి పీఠాన్ని అధిరోహించారు. మ‌గ‌ధ రాజ్య‌న్ని ప‌రిపాలించాడు. ఆయ‌న రాజ్యాన్ని విస్త‌రించుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను ఎంచుకున్నాడు.

ఈ క్రమంలో అనేక పెళ్లిళ్లు చేసుకుని బింబిసారుడు తన రాజ్యాన్ని విస్త‌రించుకొనేవాడు. అయితే, బింబిసారుడిని అత‌ని కుమారుడు రాజ్యం కోసం బంధిస్తాడు. మ‌రి ఇదే క‌థ ఆధారంగా 'బింబిసార' క‌థ‌ను తెరెకెక్కించారా? అనే విష‌యం తెలియాల్సి ఉంది. 

బింబిసార (Bimbisara) లో ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. కేథరిన్,  సంయుక్త మీనన్, వార్నియా హుస్సేన్‌లు కథానాయిక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే వెన్నెల కిశోర్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ కీల‌క పాత్ర‌లలో క‌నిపించ‌నున్నారు. మ‌ల్లాది వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బింబిసార చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. బింబిసార చిత్రం ఆగస్టు 5 వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. 

Read More: బింబిసార (Bimbisara) రాజుగా మ‌గ‌ధ రాజ్యాన్ని క‌ల్యాణ్ రామ్ ఏలుతాడా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!