బింబిసార (Bimbisara) రాజుగా మ‌గ‌ధ రాజ్యాన్ని క‌ల్యాణ్ రామ్ ఏలుతాడా!

Updated on May 29, 2022 08:38 PM IST
చెడు నుంచి మంచి వైపు న‌డిపే క‌థ‌గా బింబిసార (Bimbisara)
చెడు నుంచి మంచి వైపు న‌డిపే క‌థ‌గా బింబిసార (Bimbisara)

క‌ల్యాణ్ రామ్ (KalyanRam)  కొత్త క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ప్ర‌స్తుతం క‌ల్యాణ్ రామ్ బింబిసార సినిమాలో న‌టిస్తున్నారు. వెరైటీ రోల్‌లో కొత్త టైటిల్‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచ‌నున్నారు క‌ల్యాణ్ రామ్. సినిమా టైటిల్‌తో పాటు క‌ల్యాణ్ రామ్ లుక్ కూడా ఆక‌ట్టుకుంటుంది. త‌న తాత ఎన్టీఆర్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా క‌ల్యాణ్ రామ్ త‌న కొత్త సినిమా పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. వ‌శిష్ట్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై ఈ సినిమాను హ‌రికృష్ణ నిర్మిస్తున్నారు.

క‌ల్యాణ్ రామ్ చాలా రోజుల త‌ర్వాత చేస్తున్న సినిమా బింబిసార. యుద్ధం నేప‌థ్యంలో బింబిసార సినిమాను తీస్తున్న‌ట్లు టాక్. రెండు కాలాల్లో న‌డిచే క‌థ‌లో రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌ల్యాణ్ రామ్ న‌టిస్తున్నారు. క‌ల్యాణ్ రామ్ గెట‌ప్ చూస్తేనే ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది. ఏ టైమ్ ట్రావెల్ ఫ్ర‌మ్ ఈవిల్ టూ గుడ్ అనే ట్యాగ్ లైన్ ఈ సినిమాకు ఇచ్చారు. అంటే చెడు నుంచి మంచి వైపుకు న‌డిచే స‌మ‌యం అని అర్ధం. ఆ త‌ర్వాత‌ బింబిసార‌లో చెడు ఏంటి.. మంచి వేపు క‌ల్యాణ్ రామ్ ఎలా న‌డుస్తాడో చూడాలంటే.. ఆగ‌స్ట్ 5 వ‌ర‌కు ఆగాల్సిందే. 

యుద్ధం నేప‌థ్యంలో బింబిసార  (Bimbisara) సినిమాను తీస్తున్న‌ట్లు టాక్.

మ‌గ‌ధ‌రాజు బింబిసారుడి చ‌రిత్ర‌
మ‌గ‌ధ‌రాజు బింబిసారుడు రాజు క‌థ ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నార‌నే టాక్ వినిపిస్తుంది. మ‌గ‌ధ‌రాజు బింబిసారుడు చిన్న వ‌య‌సులోనే రాజు అయ్యాడు. మ‌గ‌ధ రాజ్య‌న్ని ప‌రిపాలించాడు. ఆయ‌న రాజ్యాన్ని విస్త‌రించుకోవ‌డానికి అనేక పెళ్లిళ్లు చేసుకున్నాడు. బింబిసారుడిని అత‌ని కుమారుడు రాజ్యం కోసం బంధిస్తాడు. మ‌రి ఈ క‌థ ఆధారంగా బింబిసార క‌థ‌ను తెరెకెక్కిస్తార‌నే విష‌యాలు తెలియాల్సి ఉంది. 

బింబిసార‌లో ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. కేథరిన్,  సంయుక్త మీనన్, వార్నియా హుస్సేన్‌లు న‌టిస్తున్నారు. వెన్నెల కిశోర్, శ్రీనివాస రెడ్డి,బ్రహ్మాజీ స్పెష‌ల్ రోల్స్ చేస్తున్నారు. చిరంతన్ భట్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!