Bimbisara Trailer: 'ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే'.. అదరగొడుతున్న ట్రైలర్!
చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకునేందుకు ‘బింబిసార’ చిత్రంతో సిద్ధమవుతున్న టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం బింబిసార (Bimbisara). 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనేది ఉపశీర్షిక. హీరోగా కల్యాణ్ రామ్ 18వ చిత్రమిది. అత్యంత భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్టు తెలిపారు మేకర్స్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మగధ రాజ్యాన్ని పరిపాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథతో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా కల్యాణ్‌రామ్ అండ్ టీం మూవీ లవర్స్ కోసం అదిరిపోయే అప్‌డేట్ ట్రైలర్ (Bimbisara Trailer) రూపంలో అందించింది. నేడు బింబిసార ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. తిగ్రర్తలా దేశాధినేత.. రాక్షసులెరుగని రావణాసురుడు.. బింబిసారగా నందమూరి కళ్యాణ్ రామ్ నటించారు.
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) తన కేరీర్ లోనే తొలిసారిగా మహాచక్రవర్తి పాత్రలో నటిస్తున్నారు. 5వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు పాత్రలో కళ్యాణ్ అద్భుతంగా నటించారు. అలాగే కాలయాత్ర ద్వారా కళ్యాణ్ ఆధునిక ప్రపంచంలో అడుగుపెట్టాడు. బింబిసారుడు ఏం చేశాడు.. ఆధునిక కాలంలోకి రావాల్సిన అవసరం ఏముందనే సందేహాలు ట్రైలర్ చూస్తే కలుగుతున్నాయి.
ట్రైలర్ లో కళ్యాణ్ రామ్ రెండు గెటప్స్ లో కనిపించారు. బింబిసారుడి గెటప్ లో కళ్యాణ్ రామ్ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంది. ఆయన డైలాగ్స్, యాక్షన్ సీన్స్ టెరిఫిక్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఎలివేట్ అయింది. 'ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే', 'ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు' అంటూ ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్ మాములుగా లేవు. మొత్తానికి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్టు కొట్టేలానే ఉన్నాడు.
'బింబిసార' సినిమాలో కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon), వరీనా హుస్సేన్ (Warina Hussain) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, వరికుప్పల యాదగిరి పాటలు రాస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. చిరంతన్ భట్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్.