Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్‌ స్పాట్‌లో.. ద‌ర్శ‌కుడు సుకుమార్ (Sukumar) సందడి !

Updated on Jun 18, 2022 06:22 PM IST
చిరంజీవి (Chiranjeevi) తో కొన్ని సీన్లు తీసిన డైరెక్ట‌ర్ బాబి.. వాటిని ద‌ర్శ‌కుడు సుకుమార్‌కు చూపించారు.
చిరంజీవి (Chiranjeevi) తో కొన్ని సీన్లు తీసిన డైరెక్ట‌ర్ బాబి.. వాటిని ద‌ర్శ‌కుడు సుకుమార్‌కు చూపించారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 'ఆచార్య' ఫ్లాప్ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కొత్త సినిమాల‌ను త్వ‌ర‌గా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు చిరు. మెగా 154 సినిమా షూటింగ్ వివ‌రాలు చిరు అభిమానుల‌ను ఖుషీ చేస్తున్నాయి. ద‌ర్శ‌కుడు బాబి ఇచ్చిన అప్‌డేట్‌తో చిరు ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవలే 'పుష్ప' దర్శకుడు సుకుమార్ కూడా చిరంజీవి సినిమా సెట్‌లో క‌నిపించ‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది.

సుకుమార్ ఎందుకెళ్లారు?
మెగా 154 సినిమాకు బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాకు 'వాల్తేరు వీర‌య్య' అనే టైటిల్ ఖ‌రారు చేశార‌ట‌. ఈ క్రమంలో మెగా 154 షూటింగ్ లొకేష‌న్‌లో ద‌ర్శ‌కుడు సుకుమార్ క‌నిపించారు. చిరంజీవి (Chiranjeevi) తో కొన్ని సీన్లు తీసిన డైరెక్ట‌ర్ బాబి.. వాటిని ద‌ర్శ‌కుడు సుకుమార్‌కు చూపించారు. ఆ ఫోటోల‌ను బాబి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. 

దీంతో భవిష్యత్తులో సుకుమార్‌తో చిరంజీవి మ‌రో సినిమా చేస్తున్నారా?  అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. సుకుమార్ మెగా 154 షూటింగ్ లొకేష‌న్‌కు ఎందుకు వెళ్లార‌నే డౌట్ అభిమానుల్లో మొద‌లైంది. ఇక సుకుమార్ మాత్రం చిరంజీవితో కాసేపు మాట్లాడార‌ట‌. బాబి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న 'వాల్తేరు వీర‌య్య' సినిమాను ఆయన ప‌ర్య‌వేక్షిస్తున్నార‌నే టాక్  కూడా వినిపిస్తుంది. సుకుమార్ ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌తో 'పుష్ప‌2' సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 

చిరు ఫుల్ బిజీ
చిరంజీవి (Chiranjeevi) 154వ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇదే చిత్రంలో రాజేంద్ర ప్ర‌సాద్, వెన్నెల కిషోర్ కూడా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు బాబి వీరికి సంబంధించిన సీన్స్‌ను షూట్ చేస్తున్నార‌ట‌. మ‌రోవైపు గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్ సినిమాలలో చిరంజీవి న‌టిస్తున్నారు. ఆచార్య ఫ్లాప్ త‌ర్వాత చిరు త‌న అభిమానుల‌కు స‌ర్ ప్రైజ్‌గా ప‌లు సినిమాల‌ను రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. 

Read More: Brahmastra Trailer : బ్ర‌హ్మాస్త్రం ట్రైల‌ర్ రిలీజ్.. ఇందులో చిరంజీవి డైలాగ్స్ వింటే ఫ్యాన్స్ ఈలలు వేయాల్సిందే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!