విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) కు బండ్ల గ‌ణేష్ కౌంట‌ర్ ఇచ్చారా?... ఆ ట్వీట్‌కు అర్థం అదేనా..

Updated on Jul 24, 2022 06:46 PM IST
 బండ్ల గ‌ణేష్ చేసిన కామెంట్ల‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) అభిమానులు మండిప‌డుతున్నారు.
బండ్ల గ‌ణేష్ చేసిన కామెంట్ల‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) అభిమానులు మండిప‌డుతున్నారు.

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda)పై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ అయింది. బండ్ల గ‌ణేష్ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై ఇప్పుడు పెద్ద దూమారంగా చెల‌రేగింది. ”తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి బ్రదర్.. ఎన్టీఆర్‌లా, మహేష్ బాబులా, రామ్ చరణ్‌లా, ప్రభాస్‌లా గొప్ప టాలెంట్ ఉండాలి ఇది గుర్తుపెట్టుకో” అంటూ బండ్ల గ‌ణేష్ ట్విటర్‌లో రాసుకొచ్చారు. బండ్ల గ‌ణేష్ చేసిన కామెంట్ల‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానులు మండిప‌డుతున్నారు.

 

 బండ్ల గ‌ణేష్ చేసిన కామెంట్ల‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) అభిమానులు మండిప‌డుతున్నారు.

లైగర్ ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) అభిమానుల‌తో ఓ మాట అన్నారు. ”మీకు మా అయ్య తెలవదు, మా తాత తెలవదు ఎవ్వడు తెలవదు. రెండేళ్లవుతోంది సినిమా రిలీజై, ఆ ముందు రిలీజైన సినిమా కూడా అంతపెద్దగా చెప్పుకునే సినిమా కూడా కాదు. అయినా టైలర్‌కి ఈ రచ్చేందిరా నాయనా” అంటూ విజ‌య్ ఎమోష‌న‌ల్ అయ్యారు. త‌న అభిమానులు త‌న కోసం ఎన్నాళ్లు అయినా ఎదురు చూస్తున్నార‌నే ఉద్ధేశంతో విజ‌య్ అలా అన్నారు. అందుకు బండ్ల గ‌ణేష్ కౌంట‌ర్ ఇచ్చారు.

బండ్ల గ‌ణేష్ చేసిన ట్వీట్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) అభిమానులు మండిప‌డుతున్నారు. విజ‌య్ అభిమానులతో మాట్లాడిన మాట‌ల‌ను.. బండ్ల గ‌ణేష్ త‌ప్పుగా వ‌క్రీక‌రిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పూరీ జ‌గ‌న్నాథ్‌పై ఉన్న కోపం విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై చూపిస్తే ఎలా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

Read More: 'లైగ‌ర్' కోసం న‌త్తిగా మాట్లాడ‌టం నేర్చుకున్నా.. కామెడీ కూడా : విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!