హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసిన జ్యోతిష్యుడు వేణు స్వామి!

Updated on Aug 27, 2022 02:09 PM IST
హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమా లైగర్ రిలీజై మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది
హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమా లైగర్ రిలీజై మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన తాజా చిత్రం లైగర్. ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా లెవెల్​లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన లైగర్‌‌ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది.

ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాలని ఆశపడ్డ విజయ్ ఆశలు నెరవేరలేక పోయాయి. ఈ సినిమా ప్లాప్ అవటంతో సెలబ్రిటీల భవిష్యత్తు చెప్పే వేణు స్వామి విజయ్ దేవరకొండ భవిష్యత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖుల భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసే వేణు స్వామి విజయ్ దేవరకొండ జాతకం గురించి చెబుతూ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కి అష్టమదశ శని ప్రభావం కొనసాగుతోందని, ఇటువంటి జాతకం ఉన్న వారి భవిష్యత్తు విభిన్నంగా ఉంటుందని వెల్లడించాడు. ఇండస్ట్రీ లో విజయ్ దేవరకొండ మరో ఉదయ్ కిరణ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మొదట ఉదయ్ కిరణ్ కూడా ఇండస్ట్రీ లో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. దీంతో ఉదయ్ కిరణ్ కెరీర్ తలకిందులైపోయింది. అందువల్ల తన జాతకం ప్రకారం విజయ్ దేవరకొండ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని వేణు స్వామి వెల్లడించారు.

హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమా లైగర్ రిలీజై మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది

మూడు సంవత్సరాల కష్టం..

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి సినిమాలు హిట్ అవటంతో స్టార్ హీరోలకు సమానంగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్స్ టాక్సీవాలా చిత్రాలు నిరాశను మిగిల్చాయి. ఇక ఇటీవల విడుదలైన లైగర్ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. లైగర్ సినిమా కోసం విజయ్ మూడు సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. కానీ అతని కష్టానికి ప్రతిఫలం మాత్రం దక్కలేదు.

ఈ సినిమాతో విజయ్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోతాడని అతని అభిమానులు ఎంతో ఆశపడ్డారు. కానీ ఈ సినిమా ప్లాప్ అవటంతో వారి కళ నెరవేరలేకపోయింది. ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే జనగణమన అనే మరొక సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాకుండా సమంత తో కలిసి ఖుషి సినిమాలో కూడా నటిస్తున్నాడు విజయ్​(Vijay Deverakonda).

Read More : ‘అర్జున్‌రెడ్డి’ విడుదలై అయిదేళ్లు..విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు థ్యాంక్స్: హీరోయిన్ షాలిని ట్వీట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!