థియేటర్ లో వాలిపోయిన విజయ్, అనన్య (Vijay-Ananya).. ప్రేక్షకుల అరుపులు, కేరింతల మధ్య లైగర్ (Liger) జంట..!

Published on Aug 26, 2022 02:33 PM IST

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో భారీ అంచనాలతో తెరకెక్కిన 'లైగర్' (Liger) మూవీ థియేటర్స్లో తెగ సందడి చేస్తోంది. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాని ప్రేక్షకులతో కలిసి వీక్షించారు నటుడు విజయ్ దేవరకొండ. హీరోయిన్ అనన్యా పాండేతో కలిసి గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ థియేటర్ లో సందడి చేశారు. 

గురువారం ఉదయం నుంచి సుదర్శన్‌ థియేటర్‌ దగ్గర ఫ్యాన్స్‌ హంగామా మొదలు కాగా.. ఈ ఇద్దరూ అక్కడికి వచ్చేసరికి వాళ్లను చూడటానికి ఎగబడ్డారు. ఆ తర్వాత థియేటర్లో ఫ్యాన్స్‌ ఈలలు, గోలల మధ్య సినిమాను చూశారు. అభిమానులు వీళ్ల దగ్గరికి వెళ్లకుండా విజయ్‌, అనన్య (Ananya Pandey) చుట్టూ బౌన్సర్లు నిల్చొని ఉండటం విశేషం. 

ఇక, 'లైగర్' (Liger Release) రిలీజ్ సందర్భంగా థియేటర్స్ వద్ద విజయ్ ఫ్యాన్స్ తీన్మార్ డ్యాన్సులు, పాలాభిషేకాలు, భారీ కటౌట్లతో హోరెత్తిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.  

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు ట్విటర్‌లో చాలా వరకూ నెగటివ్‌ రివ్యూలు వస్తున్నాయి. విజయ్‌ దేవరకొండ పర్ఫార్మెన్స్‌ అదుర్స్‌ అనిపించేలా ఉన్నా.. స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ పూరి (Director Puri Jagannadh) మార్క్‌ ఎక్కడా కనిపించలేదని, చాలా వరకూ పాత సీన్లనే మళ్లీ అతికించి సినిమా తీసినట్లుగా ఉందని ట్వీట్లు చేశారు.

Read More: 'లైగర్' (Liger) సినిమాకు బాయ్ కాట్ సెగ.. ఘాటు వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)