RRR : తెలుగు సినిమాకు మరో అరుదైన గౌరవం.. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌

Updated on Oct 27, 2022 04:00 PM IST
ఎన్టీఆర్,  రాంచరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ (RRR) సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఎన్టీఆర్, రాంచరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ (RRR) సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌ (RRR)‌.. ప్రస్తుతం ఈ పేరు భారత చలనచిత్ర పరిశ్రమతోపాటు అంతర్జాతీయ చిత్ర పరిశ్రమలో మారుమ్రోగుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా తెలుగుతోపాటు విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డులు క్రియేట్‌ చేసింది.

బాహుబలి సిరీస్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని భారతదేశానికి చాటిచెప్పిన దర్శకుడు జక్కన్న.. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో ఆ ఖ్యాతిని ప్రపంచదేశాలకు విస్తరించేలా చేశారు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ రికార్డులను క్రియేట్‌ చేయడమే కాకుండా పలు అవార్డులను, అరుదైన గౌరవాలను కూడా సొంతం చేసుకుంది.

ఎన్టీఆర్,  రాంచరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ (RRR) సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

జ్యూరీకి థాంక్స్..

ఇక, తాజాగా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో హాలీవుడ్‌ చిత్రాలకు ఇచ్చే శాటర్న్‌ అవార్డు ఈ ఏడాది ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాను వరించింది. ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఈ అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాను అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీకి కృతజ్ఞతలు చెబుతూ దర్శకుడు రాజమౌళి ఒక వీడియో సందేశాన్ని పంపించారు. 'బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ కేటగిరీలో మా సినిమా అవార్డు దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా టీమ్‌ అందరి తరఫు నుంచి జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. 'బాహుబలి - 2' తర్వాత నాకు వచ్చిన రెండో శాటర్న్‌ అవార్డు ఇది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనాలని అనుకున్నాను. అయితే.. మా సినిమా జపాన్‌లో రిలీజ్‌ కానున్న సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అందుకే రాలేకపోయాను. విజేతలందరికీ నా అభినందనలు' అని జక్కన్న వీడియో సందేశంలో పేర్కొన్నారు.

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల ఫిక్షనల్‌ కథతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌. రాంచరణ్‌, జూనియర్ ఎన్టీఆర్‌‌ హీరోలుగా నటించిన ఈ సినిమా రూ.1000 కోట్లకుపైగా వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఈ సినిమా త్వరలో జపాన్‌ దేశంలోనూ విడుదల కానుంది. ఇక, ఈ ఏడాది 'ఆస్కార్‌' (Oscars) బరిలోకి 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) దిగుతున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read More : జపాన్ లోనూ 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాకు తగ్గని జోరు.. వైరల్ అవుతున్న స్టన్నింగ్ డిజైన్ పోస్టర్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!