జపాన్ లోనూ సత్తా చూపించబోతున్న 'ఆర్ఆర్ఆర్' (RRR).. ప్రమోషన్లలో బిజీగా ఎన్టీఆర్(Jr NTR), రామ్ చరణ్ (Ram Charan)

Updated on Oct 19, 2022 01:00 PM IST
'RRR' ప్రపంచంలోని చాలా దేశాల్లో విడుదలయిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో మరిన్ని దేశాల్లో  రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
'RRR' ప్రపంచంలోని చాలా దేశాల్లో విడుదలయిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో మరిన్ని దేశాల్లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చ‌ర‌ణ్ కాంబినేషన్ లో తెర‌కెక్కిన‌ ఈ పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా వ‌సూళ్లను రాబ‌ట్టి రికార్డులు సృష్టించింది. 

'ఆర్ఆర్ఆర్' సినిమాని చూసి టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ప్రేక్షకులు, సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు అందరూ అభినందించారు. ఈ సినిమాని ఆస్కార్ కి కూడా జనరల్ కేటగిరిలో పంపించింది చిత్ర యూనిట్. ఇక, ఈ సినిమాతో దర్శకుడు రాజమౌళికి మరింత స్టార్ డమ్ వచ్చింది. 

మరోవైపు RRR సినిమా ప్రపంచంలోని చాలా దేశాల్లో విడుదలయిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో మరిన్ని దేశాల్లో కూడా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జపాన్ లో కూడా RRR సినిమాని ఈ నెల 21న విడుదల చేయబోతున్నారు. 

దీంతో ఈ సినిమాను జపాన్ లో ప్రమోట్ చేయడానికి 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఇప్పటికే జపాన్ చేరుకుంది. రామ్ చరణ్ (Ram Charan) తన భార్య ఉపాసనతో వెళ్లగా.. ఎన్టీఆర్ (Jr NTR) తన భార్య ప్రణతి, ఇద్దరు కొడుకులను తీసుకొని జపాన్ వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు రోజులపాటు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చూసుకోవడంతోపాటు ఆ తర్వాత ఫ్యామిలీతో జపాన్‌ టూర్‌ని ఎంజాయ్‌ చేయబోతున్నారు. అందుకే వీరంతా ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నట్టు సమాచారం.  

పీరియాడిక్  డ్రామా నేప‌థ్యంలో తెరకెక్కిన 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో (RRR) రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో నటించగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర‌లో న‌టించారు. బాలీవుడ్ భామ అలియాభ‌ట్ (Alia Bhatt), ఉక్రెయిన్ భామ ఒలీవియా మోరిస్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో న‌టించారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత డీవీవీ దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు.

Read More: 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా ఆస్కార్ కు నామినేట్ కాకపోవడంపై రష్మిక మందన్నా (Rashmika Mandanna) కీలక వ్యాఖ్యలు..!

Advertisement
Credits: Twitter, Pinkvilla

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!