జపాన్ లోనూ 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాకు తగ్గని జోరు.. వైరల్ అవుతున్న స్టన్నింగ్ డిజైన్ పోస్టర్!

Updated on Sep 02, 2022 04:33 PM IST
తాజాగా ఇండియాస్ బెస్ట్ ఎవర్ మల్టీ స్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' (RRR) జపాన్ దేశంలో కూడా భారీ రిలీజ్ కి సిద్ధమయ్యింది.
తాజాగా ఇండియాస్ బెస్ట్ ఎవర్ మల్టీ స్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' (RRR) జపాన్ దేశంలో కూడా భారీ రిలీజ్ కి సిద్ధమయ్యింది.

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) 'బాహుబలి' (Bahubali) సిరీస్ సినిమాలతో తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్‌ను తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” (RRR). ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టారు. ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.

ఇదిలా ఉంటే.. 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ద్వారా పదుల కొద్ది దేశాల్లో ప్రేక్షకులకు చేరువయ్యింది. స్థానిక భాషల్లో కొన్ని చోట్ల.. స్థానిక భాష సబ్ టైటిల్స్ తో కొన్ని చోట్ల 'ఆర్ఆర్ఆర్' సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు.   

ఈ క్రమంలో తాజాగా ఇండియాస్ బెస్ట్ ఎవర్ మల్టీ స్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' (RRR) జపాన్ దేశంలో కూడా భారీ రిలీజ్ కి సిద్ధమయ్యింది. ఇందులో భాగంగానే అక్కడి ఫేమస్ గేమ్ డిజైనర్ కొజిమ హిడియో RRR సినిమాపై డిజైన్ చేసిన ఓ స్టన్నింగ్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్టర్ తెలుగు వెర్షన్ కి భిన్నంగా చాలా కొత్తగా ఉంది. ఇద్దరు హీరోలను హైలైట్ చేస్తూనే సినిమాలో అత్యంత ఆసక్తికరమైన జంతువుల సన్నివేశాన్ని పోస్టర్ లో చూపించారు. పోస్టర్ ని చూసిన అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జపాన్ లో ఈ సినిమాను అక్టోబర్ 21వ తేదీన రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ డబ్బింగ్ చేయడంతో పాటు ప్రత్యేకంగా పోస్టర్స్ ను క్రియేట్ చేయించారు. అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని అక్కడి ఫిల్మ్ మేకర్స్ థియేటర్ రిలీజ్ కు సిద్ధం అయ్యారట. జపాన్ లో కూడా మన 'ఆర్ఆర్ఆర్' ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Read More: '1770' Movie: మరో సంచలన కథ రాసిన 'ఆర్ఆర్ఆర్' (RRR) రచయిత విజయేంద్రప్రసాద్.. బెంగాల్ నవల ఆధారంగా సినిమా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!