చిరంజీవి ‘మెగా 154’ (Mega 154) నుంచి క్రేజీ అప్డేట్.. ''బాస్ వస్తున్నాడు''.. టైటిల్ టీజర్ రేపే విడుదల..!

Updated on Oct 23, 2022 01:35 PM IST
‘దీపావళి సందర్భంగా ‘మెగా 154’ (Mega 154) టైటిల్ టీజర్ ను విడుదల చేస్తున్నాం. మాస్ ఎక్స్ ప్లోజన్ తోనే దీపావళి ప్రారంభం అవుతుంది.
‘దీపావళి సందర్భంగా ‘మెగా 154’ (Mega 154) టైటిల్ టీజర్ ను విడుదల చేస్తున్నాం. మాస్ ఎక్స్ ప్లోజన్ తోనే దీపావళి ప్రారంభం అవుతుంది.

ఇటీవల 'గాడ్ ఫాదర్' (Godfather) సినిమాతో ప్రేక్షకుల అలరించన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం తన తదుపరి సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ప్రకటించిన నాటి నుంచి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

ఈ సినిమాలో మాస్‌ మహరాజా రవితేజ (Raviteja) ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. 'మెగా154 '(వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్‌, టీజర్లు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాయి. కాగా దీపావళి పండగను పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్‌ ఇచ్చింది చిత్రబృందం.

తాజాగా విడుదలైన అప్డేట్ ప్రకారం.. ‘దీపావళి సందర్భంగా ‘మెగా 154’ (Mega 154) టైటిల్ టీజర్ ను విడుదల చేస్తున్నాం. మాస్ ఎక్స్ ప్లోజన్ తోనే దీపావళి ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 24న (రేపు) ఉదయం 11:07 నిమిషాలకు అప్డేట్ వస్తుంది. ఈ సందర్భంగా మాస్ మూలవిరాట్ కు స్వాగతం పలుకుదాం.’ అంటూ అనౌన్స్ చేశారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. టైటిల్ టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. 

అయితే, సోమవారం రావాల్సిన టైటిల్ టీజర్ కంటే.. ముందే తాజాగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌లో పంచెకట్టుతో మెగాస్టార్‌ స్టైల్‌, సిగరెట్‌ తాగే విధానం, దేవిశ్రీప్రసాద్ బీజీఎం.. ఇలా అన్నీ అదిరిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 'మెగా 154' (Mega 154) అప్డేట్‌ నెట్టింట్లో బాగా ట్రెండ్‌ అవుతోంది. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. 

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చిరంజీవి (Megastar Chiranjeevi) సరసన శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ లేడీ విలన్ రోల్ పోషిస్తోందట. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానకుగా వచ్చే ఏడాది జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Read More: Chiranjeevi: 'మెగా154' (Mega 154) నుంచి క్రేజీ అప్‌డేట్‌.. నేటి నుంచి డబ్బింగ్ ప్రారంభం.. దీపావళికి టీజర్?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!