ఓటీటీలో కూడా నా ఆట చూడండి అంటున్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం ) (RRR)

Updated on May 13, 2022 09:14 PM IST
స్వాతంత్య్ర స‌మ‌ర యోధుల‌పై ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తీసిన సినిమా రౌద్రం ర‌ణం రుధిరం((RRR). ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఆర్.ఆర్.ఆర్. ఓటీటీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది.
స్వాతంత్య్ర స‌మ‌ర యోధుల‌పై ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తీసిన సినిమా రౌద్రం ర‌ణం రుధిరం((RRR). ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఆర్.ఆర్.ఆర్. ఓటీటీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది.

స్వాతంత్య్ర స‌మ‌ర యోధుల‌ జీవిత కథల ఆధారంగా ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌ఎస్‌ రాజ‌మౌళి తీసిన సినిమా రౌద్రం ర‌ణం రుధిరం ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ (RRR). ఎన్టీఆర్, రాంచర‌ణ్ న‌టించిన ఈ సినిమా ఓటీటీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. మే 20న జీ5 ఓటీటీ ప్లాట్ ఫాంలో ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్ కానుంది. 

స‌మ‌ర యోధుల పోరాటాన్ని ఆర్ఆర్ఆర్ (RRR) తెరకెక్కించాడు రాజ‌మౌళి. కొమురం భీముడిగా ఎన్టీఆర్, అల్లూరిగా రాంచ‌ర‌ణ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్, రాం చ‌ర‌ణ్‌ త‌మ న‌ట విశ్వ‌రూపాన్ని చూపించారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రౌద్రం ర‌ణం రుధిరం సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌‌గా నిలిచింది. 

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ RRR

భార‌తీయ సినిమా రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టేలా డైరెక్టర్‌‌ రాజ‌మౌళి సినిమాను తెరకెక్కించాడు. రూ.1,000 కోట్లకు పైగా వ‌సూళ్లు సాధించి కాసుల వర్షం కురిపించింది ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌. అమెరికాలో సైతం 14 మిలియ‌న్ డాల‌ర్లు వసూలు చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.451 కోట్ల బిజినెస్ చేసింది. 

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా ఓటీటీని కూడా షేక్ చేసేలా రాజమౌళి ప్లాన్‌ చేశాడు. ఈక్రమంలోనే ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ ఓటీటీ వెర్షన్‌ కోసం స్పెషల్‌గా ట్రైలర్‌‌ను రిలీజ్ చేశారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈనెల 20 నుంచి జీ5 ప్రీమియంలో స్ట్రీమింగ్ కానున్న ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా ఓటీటీ ట్రైలర్‌‌ను లక్షల మంది వీక్షిస్తున్నారు.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!