శంకర్‌‌ సినిమాలో త్రిపాత్రాభినయం చేయనున్న రాంచరణ్‌ (Ramcharan)?

Updated on May 25, 2022 06:38 PM IST
రాంచరణ్‌, శంకర్‌‌ సినిమా పోస్టర్
రాంచరణ్‌, శంకర్‌‌ సినిమా పోస్టర్

మెగాపవర్ స్టార్ రాంచరణ్ (Ramcharan) ఇటీవల ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ అందుకున్నాడు. తాజాగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం రిజల్ట్‌ కొద్దిగా నిరాశపరిచినప్పటికీ..  తర్వాత సినిమా బ్లాక్ బస్టర్‌‌తో దాన్ని మరిచిపోయేలా చేసేందుకు చెర్రీ ప్రయత్నిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో రాంచరణ్‌ తదుపరి సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ వైజాగ్‌లో ఇటీవల ప్రారంభమైంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన పలు వార్తలు అభిమానుల్ని ఊరిస్తున్నాయి.

ఈ సినిమాలో రాంచరణ్‌ డబుల్‌ రోల్‌లో కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే శంకర్‌‌ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో చరణ్‌ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడని, అందులో ఒకటి నెగెటివ్ క్యారెక్టర్‌‌ అని ఇండస్ట్రీ టాక్. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం తండ్రి, ఇద్దరు కొడుకులుగా రాంచరణ్‌ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ కొడుకుల్లో ఒకరిది నెగెటివ్‌ షేడ్ ఉన్న క్యారెక్టర్‌‌ అని, సినిమాలో ఆ క్యారెక్టర్‌‌ హైలైట్‌ అని సమాచారం. తండ్రిది సివిల్ సర్వెంట్‌ పాత్ర అని టాక్. సాధారణంగా శంకర్‌‌ తన సినిమాల్లో హీరో కంటే విలన్‌నే పవర్‌‌ఫుల్‌గా చూపిస్తాడు.  

రాంచరణ్, శంకర్‌‌, దిల్‌ రాజు

రాంచరణ్‌ తండ్రి మెగాస్టార్‌‌ చిరంజీవి తన కెరీర్‌‌లో ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రంలో త్రిపాత్రాభినయం చేశాడు. ఆ సినిమాలో అన్నదమ్ముల  క్యారెక్టర్‌‌ చేసిన చిరు యాక్టింగ్‌తో అభిమానులను మెప్పించాడు. అయితే ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్‌ దగ్గర యావరేజ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ వార్తల సంగతి ఎలా ఉన్నా  నిజంగానే తన 15వ సినిమాలో రాంచరణ్‌ (Ramcharan) త్రిపాత్రాభినయం చేస్తాడా లేదా చూడాలి మరి.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!