Rajinikanth : రజినీకాంత్ రైటర్‌గా కొత్త అవతారం ఎత్తేస్తున్నారట... 'బీస్ట్' డైరెక్టర్‌తో సినిమాకి కథ రెడీ !
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్.. పరిచయం అక్కర్లేని పేరు. ఈయన క్రేజ్ గురించి తెలియని సినీ అభిమాని ఉండడు. దక్షిణాదితో పాటు హిందీ చిత్ర పరిశ్రమలో కూడా ఈయనకు ఎనలేనిమంది ఫ్యాన్స్ ఉన్నారు.
జపాన్, మలేషియా, అమెరికా లాంటి దేశాలలో కూడా రజనీకి మంచి ఫాలోయింగే ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఆయన సినిమాలకు ఒక ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది. ముత్తు, నరసింహ, అరుణాచలం, చంద్రముఖి, శివాజీ, రోబో.. లాంటి చిత్రాలు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.
ప్రభావం చూపని రజనీ గత సినిమాలు
అయితే కొంతకాలంగా రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత ప్రభావం చూపించడం లేదన్న టాక్ నడుస్తోంది. దీంతో ఈసారి పక్కాగా ఓ కథను సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన.
నెల్సన్ దిలీప్ కుమార్‌తో ప్రస్తుతం రజనీకాంత్ ఓ సినిమా సైన్ చేశారు. అయితే వరుణ్ డాక్టర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన నెల్సన్, బీస్ట్ లాంటి ఫ్లాప్ సినిమా కూడా ఇచ్చాడన్న విషయం మరిచిపోరాదు.
రచయితగా రజనీ కొత్త అవతారం ?
అయితే, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, రజనీకాంత్ (Rajinikanth) ఈ సినిమాకు స్వయంగా కథను సమకూరుస్తున్నారని టాక్. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారమూ బయటకు రాలేదు. ఇది రజనీకి 169 వ చిత్రం కావడం విశేషం.
అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా.. రమ్య కృష్ణ, ప్రియాంక అరుళ్ మోహన్, శివ రాజ్ కుమార్ మొదలైన భారీ తారాగణమే ఈ చిత్రంలో నటించడం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం, జులైలో సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందట. ఒకవేళ ఈ సినిమాకి రజనీకాంత్ గనుక కథను సమకూరిస్తే, ఆ కిక్కే వేరు కదా.
Read More: రజనీకాంత్ (Rajinikanth) తన కొత్త సినిమా రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లు పెంచారో తెలుసా!