ర‌జనీకాంత్ (Rajinikanth) తన కొత్త సినిమా రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లు పెంచారో తెలుసా!

Updated on May 22, 2022 07:20 PM IST
 ర‌జ‌నీకాంత్  (Rajinikanth) రూ.150 కోట్ల రెమ్యూనరేషన్  తీసుకుంటార‌నే ప్ర‌చారం జోరుగా కొన‌సాగుతుంది. 
 ర‌జ‌నీకాంత్ (Rajinikanth) రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటార‌నే ప్ర‌చారం జోరుగా కొన‌సాగుతుంది. 

భారతీయ సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక స్పెష‌ల్ ఇమేజ్ ఉన్న హీరో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth). నాలుగు ద‌శాబ్దాల నుండీ న‌టిస్తూ ర‌జ‌నీ.. ప్రేక్ష‌కుల‌కు తనదైన శైలిలో వినోదాన్ని పంచుతున్నారు. త‌లైవాగా తన అభిమానుల ఆదరణనూ పొందారు. ప్ర‌స్తుతం ఆయన చేస్తున్న కొత్త సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ర‌జ‌నీకాంత్ తన కొత్త సినిమాకు తీసుకునే రెమ్యూన‌రేష‌న్ కోట్ల‌లో పెంచేశార‌ని టాక్. 

డెభై ఏళ్ల వ‌య‌సులోనూ ర‌జనీకాంత్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. ఏడాదికి ఒక్క సినిమా చేస్తూ, ఫ్యాన్స్‌ను సంతోష‌పెడుతున్నారు. ఆయన తాజాగా న‌టించిన‌ త‌మిళ సినిమా.. తెలుగులో పెద్ద‌న్న‌గా రిలీజ్ అయింది. త‌మిళ్‌లో హిట్ అయిన ఈ సినిమా, తెలుగులో విజ‌యం సాధించ‌లేదు.  తెలుగు, తమిళ భాషలలో విడుదలై, రజనీకాంత్‌కు ఆఖరిగా బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించిపెట్టిన సినిమా ఏదైనా ఉందంటే.. అది 'రోబో' ఒక్కటే.

ఆ సినిమా త‌ర్వాత, అదే స్థాయి హిట్ ర‌జ‌నీకాంత్ అందుకోలేదు. రోబో త‌ర్వాత వ‌చ్చిన క‌బాలీ, 2.0, పేటా, దర్బార్, కాలా చిత్రాలు.. అనుకున్నంత సూప‌ర్ హిట్ కాలేదు. 'పేట' సినిమా హిట్ టాక్‌ను తెచ్చుకున్నా.. బ్లాక్ బాస్ట‌ర్ కాలేక‌పోయింది. 

రోబో సినిమా ర‌జ‌నీకాంత్‌ (Rajinikanth) కు బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చింది.

విజ‌య్‌తో 'బీస్ట్' సినిమా తీసిన నెల్స‌న్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) ర‌జ‌నీకాంత్‌తో ఓ సినిమా చేస్తున్నారు. 'బీస్ట్‌'తో భారీ ఫ్లాప్ అందుకున్న ఆయన.. ర‌జ‌నీకాంత్ సినిమాతో బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కొట్టే ఓ మూవీ చేయాల‌నుకోవడం విశేషం. మ‌రోవైపు 'త‌లైవా' తన రెమ్యూన‌రేష‌న్ మరో రూ.50 కోట్లు పెంచార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అంత‌కు ముందు వ‌ర‌కు, ర‌జ‌నీకాంత్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల వ‌ర‌కు తీసుకునేవార‌ట‌. నెల్స‌న్ సినిమాకు ర‌జ‌నీ రూ.150 కోట్లు తీసుకుంటార‌నే ప్ర‌చారం జోరుగా కొన‌సాగుతుంది. 

 

ర‌జ‌నీకాంత్ (Rajinikanth) సినిమాలో ర‌మ్య‌కృష్ణ ఓ స్పెష‌ల్ రోల్ చేస్తున్నార‌ట‌

అలాగే ర‌జ‌నీకాంత్ (Rajinikanth)  నటించే  తదుపరి సినిమాలో ర‌మ్య‌కృష్ణ ఓ స్పెష‌ల్ రోల్ చేస్తున్నార‌ట‌. 'న‌ర‌సింహ' సినిమాలో వీరిద్ద‌రూ చేసిన మాస్ యాక్ష‌న్‌ సీన్స్‌కు మించి.. దిలీప్ సినిమాలో సీన్స్ ఉండ‌నున్నాయ‌ట‌.  అలాగే ర‌మ్య‌కృష్ణ నెగ‌టివ్ రోల్‌లో అదిరిపోయే డైలాగులు పేల్చ‌నున్నార‌ట‌. తలైవర్ 169 చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధిమార‌న్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్  ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ  సినిమాకు క‌థ‌ను రూపొందించే ప‌నిలో చిత్ర యూనిట్ ఉంద‌ట‌. ర‌జ‌నీ, నెల్స‌న్ కాంబోలో వ‌స్తున్న ఈ  సినిమా ఆగ‌స్టు నుంచి సెట్స్‌ పైకి వెళ్ల‌నుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!