ఏ భాషలోనైనా నటిస్తా.. ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు: ‘కాంతార’ (Kantara) హీరోయిన్ సప్తమి గౌడ (Sapthami Gowda)

Updated on Oct 18, 2022 12:09 PM IST
‘కాంతార’ (Kantara) ఇంతటి విజయాన్ని సాధిస్తుందని తాను అనుకోలేదని ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సప్తమి గౌడ (Sapthami Gowda) అన్నారు
‘కాంతార’ (Kantara) ఇంతటి విజయాన్ని సాధిస్తుందని తాను అనుకోలేదని ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సప్తమి గౌడ (Sapthami Gowda) అన్నారు

ఒకే ఒక్క చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు కన్నడ హీరోయిన్ సప్తమి గౌడ (Sapthami Gowda). ఎన్నో సినిమాల్లో నటిస్తే కానీ రాని పేరు.. ఒక్క మూవీతో దక్కడం అరుదనే చెప్పాలి. శాండల్‌వుడ్ బ్లాక్ బస్టర్ ‘కాంతార’ (Kantara)తో సప్తమి గౌడ అలాంటి గుర్తింపునే సంపాదించారు. ఈ చిత్రం పాన్ ఇండియా హిట్‌గా నిలవడంతో సప్తమికి ఓవర్ నైట్ క్రేజ్ వచ్చేసింది. ‘కాంతార’ ఆమెకు రెండో సినిమా కావడం విశేషం. 

పెద్దగా నటనా అనుభవం లేకున్నా ‘కాంతార’లో హీరోయిన్ పాత్రకు సరిపోతుందనే ఉద్దేశంతో సప్తమి గౌడకు అవకాశం ఇచ్చారు హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty). ఈ మూవీకి ఆయనే దర్శకుడు, కథకుడు కావడం విశేషం. రిషబ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న సప్తమి.. తన పాత్రకు న్యాయం చేశారు. హీరోకు ప్రియురాలిగా, ఫారెస్ట్ కానిస్టేబుల్‌గా పరిణతితో కూడిన నటనను కనబర్చారు. 

అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు

‘కాంతార’ చిత్రం కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ గ్రాండ్ సక్సెస్ అవ్వడం గురించి సప్తమి గౌడ స్పందించారు. ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధిస్తుందని తాను ఊహించలేదన్నారు. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ నుంచి ఈ స్థాయిలో ప్రేమను ఎక్స్‌పెక్ట్ చేయలేదని సప్తమి చెప్పారు. తన కెరీర్‌లో ఇంత త్వరగా ఇలాంటి విజయం, గుర్తింపు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నారు. ‘కాంతార’లో భాగమైనందుకు గర్వంగా, చెప్పలేనంత సంతోషంగా ఉందని సప్తమి తెలిపారు. ఈ సినిమాలో ఛాన్స్ దక్కడం తన అదృష్టమన్నారు. 

రిషబ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నా

‘ఈ ప్రాజెక్టు కోసం తొలుత నన్ను సంప్రదించినప్పుడు కథేంటో, నా పాత్ర ఎలా ఉంటుందనే విషయం నాకు తెలియదు. కానీ, ఈ సినిమా దర్శకుడు, హీరో అయిన రిషబ్ శెట్టి నాపై నమ్మకం ఉంచి.. నన్ను కథానాయికగా ఎంపిక చేశారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నా. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే భావిస్తున్నా. ఇకపై ఇతర భాషల సినిమాల్లో నటించే అవకాశాలు వస్తే ఏ మాత్రం సంకోచించకుండా యాక్ట్ చేస్తా. వాటికి ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు’ అని సప్తమి స్పష్టం చేశారు.

ఇకపోతే, కేజీఎఫ్’ను నిర్మించిన హొంబలే ప్రొడక్షన్స్ సంస్థ.. ‘కాంతార’ చిత్రాన్ని రూపొందింది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ఈ సినిమాలో హీరోగా నటించడమే గాక దర్శకత్వం వహించారు. మూవీకి కథనూ ఆయనే అందించారు. ‘కాంతార’లో రిషబ్ సరసన సప్తమి గౌడ కథానాయికగా నటించారు. ప్రముఖ నటులు కిశోర్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌ శెట్టి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించారు. ‘కాంతార’కు అంజనీష్‌ లోక్‌‌నాథ్‌ మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించారు.

Read more: స్టార్లు, వీఎఫ్ఎక్స్ ఉంటే సరిపోదు.. ‘కాంతార’ (Kantara)ను చూసి నేర్చుకోవాలనంటున్న ఆర్జీవీ (Ram Gopal Varma)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!