నవ్వులు పూయిస్తున్న 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari) ట్రైలర్.. నాగశౌర్యకు హిట్ దక్కినట్లేనా..?

Updated on Sep 10, 2022 07:23 PM IST
తాజాగా 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari Trailer) సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేకర్స్.
తాజాగా 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari Trailer) సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేకర్స్.

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య (Naga Shourya) హీరోగా వ‌స్తున్న తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari). షెర్లీ సెటియా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు అనీశ్ ఆర్.కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ సెప్టెంబర్ 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. 

తాజాగా 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari Trailer) సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో, ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ట్రైలర్ విషయానికి వస్తే.. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, లవ్.. రొమాన్స్.. కామెడీ.. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. 'కేఎఫ్‌సీ' (KFC) అంటూ కార‌ప్పొడి చ‌ట్నీ అంటూ బ్ర‌హ్మాజీ కొత్త అర్థం చెప్ప‌డం ఇవ‌న్నీ న‌వ్వులు పూయించాయి. 

గ్రామీణ నేపథ్యంలో తల్లిముందు అమాయకంగా కనిపించిన హీరో, ఉద్యోగం కోసం సిటీకి వెళతాడు. తన ఆఫీసులోని అమ్మాయితో ప్రేమలో పడతాడు. హీరో పెరిగిన వాతావరణానికీ.. హీరోయిన్ షిర్లే సెటియా (Shirley Setia) పెరిగిన వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ఆ తరువాత ఏం జరగనుందనే ఆసక్తిని రేకెత్తించారు. 

వెన్నెల కిశోర్ (Vennela Kishore), సత్య కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, ఈ సినిమాలో బ్రహ్మాజీ, రాధికా శరత్ కుమార్, రాహుల్ రామ‌కృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 'కృష్ణ వ్రింద విహారి' నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Read More: కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari) గురించి టాప్ 10 ఆసక్తికర విషయాలు మీకోసం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!