Ponniyin Selvan1: 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' చిత్రంలో మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయ‌నున్న ఎ.ఆర్.రెహ‌మాన్

Updated on Jul 26, 2022 06:53 PM IST
Ponniyin Selvan 1: ఎ. ఆర్. రెహమాన్, శివ‌మ‌ణితో క‌లిసి  'పొన్నియిన్ సెల్వ‌న్ 1' బీటీఎస్‌ను రూపొందిస్తున్న‌ వీడియోను విడుద‌ల చేశారు.
Ponniyin Selvan 1: ఎ. ఆర్. రెహమాన్, శివ‌మ‌ణితో క‌లిసి 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' బీటీఎస్‌ను రూపొందిస్తున్న‌ వీడియోను విడుద‌ల చేశారు.

Ponniyin Selvan1: 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతుంది. దీంతో మేక‌ర్స్ చిత్ర ప్ర‌మోష‌న్ల‌ను మ‌రింత పెంచారు. 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' సినిమాను ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' చిత్ర యూనిట్ తాజాగా ఓ మ్యూజిక్ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆస్కార్ అవార్డు గ‌హ్రీత ఎ.ఆర్. రెహ‌మాన్, శివ‌మ‌ణి ఈ చిత్రానికి త‌మ‌దైన శైలిలో స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు.

 

 

Ponniyin Selvan 1: ఎ. ఆర్. రెహమాన్, శివ‌మ‌ణితో క‌లిసి  'పొన్నియిన్ సెల్వ‌న్ 1' బీటీఎస్‌ను రూపొందిస్తున్న‌ వీడియోను విడుద‌ల చేశారు.

స్వ‌రాల‌ను సిద్ధం చేస్తున్న ఎ.ఆర్. రెహ‌మాన్

పొన్నియిన్ సెల్వ‌న్ 1 (Ponniyin Selvan1) బీటీఎస్‌ను రూపొందించేందుకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్. రెహ‌మాన్, శివ‌మ‌ణిలు క‌లిసి చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని వీడియోలో బంధించారు. ఆ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేశారు. చ‌ప‌ట్ల‌తో, వాయిద్యాల‌తో, క‌ర్ర‌ల‌తో స‌రికొత్త రాగాల‌ను ప‌లికిస్తూ చేసిన వినూత్న ప్రయోగం ఇది. ఈ వీడియోలో శివ‌మ‌ణి డ్ర‌మ్స్ కొడుతుంటే.. రెహ‌మాన్  త‌కిట‌త‌కిట త‌క్ త‌క్  అంటూ ఊగిపోతున్నారు. ప్రస్తుతం ఇదే వీడియో వైరల్‌గా మారింది. 

ఐదు భాష‌ల్లో విడుద‌ల‌

'పొన్నియిన్ సెల్వ‌న్ 1' చిత్రంలో చియాన్ విక్ర‌మ్‌, కార్తి, జయం రవి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష, బాబీ సింహ వంటి ప్ర‌ముఖులు న‌టిస్తున్నారు. ఈ సినిమా మొద‌టి భాగం సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో కలిసి మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై మ‌ణిర‌త్నం స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించారు. 

Read More : Ponniyin Selvan (పొన్నియిన్ సెల్వన్ 1) : ఈ రోజే టీజర్ రిలీజ్.. ఈ సినిమాకు సంబంధించిన టాప్ 10 విశేషాలు ఇవే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!