Nithiin : నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలోని "రారా రెడ్డి" సాంగ్‌ అదుర్స్.. ఈ గీతం ప్రత్యేకత ఏంటో తెలుసా?

Updated on Jul 10, 2022 06:51 PM IST
నితిన్ (Nithiin) కథానాయకుడిగా నటిస్తున్న మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో హీరోయిన్ అంజ‌లి  స్పెష‌ల్ సాంగ్‌లో యాక్ట్ చేశారు.
నితిన్ (Nithiin) కథానాయకుడిగా నటిస్తున్న మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో హీరోయిన్ అంజ‌లి స్పెష‌ల్ సాంగ్‌లో యాక్ట్ చేశారు.

Macherla Niyojakavargam: టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) తాను న‌టిస్తున్న‌ 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం'లో తన మాస్ యాక్ష‌న్‌తో అద‌ర‌గొట్ట‌నున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవలే మేక‌ర్స్ స్పెష‌ల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. 'రా.. రా.. రెడ్డి' పాట‌ ప్రోమోలో అంజ‌లి, నితిన్ ర‌చ్చ రచ్చ చేశారనే చెప్పాలి. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమాకు ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎం.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

సాంగ్ ప్రోమోకు మిలియ‌న్ వ్యూస్‌

'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమా నుంచి విడుద‌లైన రా..రా..రెడ్డి సాంగ్ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. హీరోయిన్ అంజ‌లి గతంలో కూడా 'సరైనోడు' సినిమాలో 'బ్లాక్ బస్టర్' పేరిట ఓ స్పెషల్ సాంగ్ చేశారట . ప్రస్తుతం టాప్ కథానాయికలు అందరూ ఐటం సాంగ్స్ బాట పట్టడం గమనార్హం.

నటి సమంత 'పుష్ఫ' సినిమాలో చేసిన స్పెష‌ల్ సాంగ్ 'ఉ.. అంటావా మామా' సూప‌ర్ హిట్ అయింది. అంజ‌లి కూడా స‌మంత బాట‌లోనే కొన‌సాగడం విశేషం.  ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన పోస్ట‌ర్‌లు, గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.  రిలీజ్ చేసిన 24 గంట‌ల్లో 'రా..రా.. రెడ్డి' మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్టింది.

మాస్ పాటలు రాయడంలో కాసర్ల శ్యామ్ అందె వేసిన చేయి

కాసర్ల శ్యామ్‌కు మాస్ పాటలు రాయడంలో ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. నీలపురిగాజుల ఓ నీలవేణి నిలుసుంటే కిష్ణవేణి (మహాత్మ), యు ఆర్‌ మై డార్లింగో.. లింగో లింగో లింగ్‌ (జక్కన్న), బొమ్మోలే ఉన్నదిర పోరీ.. బాంభాట్‌ గుందిరా నారీ (లై), రాములో రాములా.. నన్నాగం జేసిందిరో (అల వైకుంఠాపురంలో), డీజే టిల్లూ పేరు (డీజే టిల్లు).. మొదలైన పాటలు శ్యామ్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఆయనే మళ్లీ 'మాచర్ల నియోజకవర్గం' సినిమా కోసం ఈ 'రారా రెడ్డి' అనే వెరైటీ పాటను వ్రాయడం విశేషం. 

మహతి స్వరసాగర్ సంగీతం అదుర్స్

మహతి స్వరసాగర్ గతంలో నితిన్ నటించిన చాలా సినిమాలకు సంగీతం అందించారు. ముఖ్యంగా ఇష్క్, భీష్మ, మాస్ట్రో లాంటి సినిమాలకు మహతి అందించిన సంగీతం తనకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 'భోళా శంకర్' చిత్రానికి కూడా మహతి సంగీతం అందించడం విశేషం.

లిప్సిక గాత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే

లిప్సిక .. యువ గాయణీమణులలో ఈమెకు ప్రత్యేక స్థానం ఉంది. బుగ్గంచున ఎరుపు (జవాన్), ఏదో మనసున మెలికై (ఓ పిట్టకథ) లాంటి పాటలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈమెకు 'రారా రెడ్డి' పాట పాడే అవకాశం దక్కింది. 

Macherla Niyojakavargam: : నితిన్ (Nithiin) న‌టించిన 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమా ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్ పాత్ర‌లో ఈ సినిమాలో నితిన్ క‌నిపించ‌నున్నారు.  ఈ చిత్రంలో కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఆదిత్య మూవీస్, ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Read More : Jayam Movie: నితిన్ తొలి సినిమాకి 20 ఏళ్లు ! 'జయం' అప్పట్లో ఓ సంచలనం !


టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!