Macherla Niyojakavargam: మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగుపెట్ట‌నున్న నితిన్ (Nithiin).. ఎప్పుడంటే..

Updated on Jun 25, 2022 02:43 PM IST
 హీరో నితిన్ న‌టించిన‌  (Nithiin) మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం చిత్రం ఆగ‌స్ట్ 12న విడుద‌ల కానుంది.
హీరో నితిన్ న‌టించిన‌  (Nithiin) మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం చిత్రం ఆగ‌స్ట్ 12న విడుద‌ల కానుంది.

Macherla Niyojakavargam: టాలీవుడ్‌లో హీరో నితిన్  (Nithiin) సినిమాలకు ఉన్న క్రేజే వేరు. యూత్, యాక్ష‌న్ క‌థ‌ల‌తో నితిన్ ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచుతారు. నితిన్ న‌టించిన‌ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం చిత్రం విడుద‌ల కానుంది. ఈ సినిమా ఎమ్.ఎస్.రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో తెర‌కెక్కింది. నితిన్‌కు జోడిగా కృతి శెట్టి న‌టిస్తున్నారు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి అందిన లేటెస్ట్ అప్‌డేట్ నితిన్ అభిమానుల్లో జోష్ నింపింది. 

మాస్ లుక్‌లో నితిన్
మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం చిత్రం విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్రకటించారు. ఈ సినిమా ఆగ‌స్ట్ 12న విడుద‌ల కానుంది. ఈ అప్‌డేట్‌తో పాటు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

అలాగే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ వర్క్ కూడా పూర్తి అయిందని మేకర్స్ తెలిపారు. ఒక్క పాట మిన‌హా మిగ‌తా షూటింగ్ పూర్త‌యింద‌ని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. మాస్ లుక్‌లో నితిన్  (Nithiin) అద‌ర‌గొడుతున్నారు. 
 
అద‌ర‌గొట్ట‌నున్న కృతి శెట్టి
నితిన్ (Nithiin) సరసన ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కృతి శెట్టి ఈ సినిమాలో డిఫెరెంట్ రోల్‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. మాచ‌ర్ల‌ నియోజ‌క‌వ‌ర్గం సినిమాని రాజ‌కీయ నేప‌థ్యంలో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. నితిన్ లుక్ కూడా ఓ పొలిటిక‌ల్ లీడ‌ర్‌‌ను తలపిస్తుంది.

ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.  ఆదిత్య మూవీస్,  శ్రేష్ట్ మూవీస్‌  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ఆగ‌స్టు 12న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

Read More: Krithi Shetty: మరోసారి నాగచైతన్యతో బేబమ్మ.. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కృతి శెట్టి!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!