ఎంటర్‌‌టైనింగ్‌గా రాజ్ తరుణ్‌ (Raj Tarun) ‘అహ నా పెళ్లంట’ ట్రైలర్.. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో

Updated on Nov 01, 2022 02:31 PM IST
సరైన హిట్ సినిమా కోసం  ఎదురుచూస్తున్న హీరో రాజ్ తరుణ్ (Raj Tarun).. జీ5లో స్ట్రీమింగ్‌ కానున్న ‘అహ నా పెళ్లంట’ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు
సరైన హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న హీరో రాజ్ తరుణ్ (Raj Tarun).. జీ5లో స్ట్రీమింగ్‌ కానున్న ‘అహ నా పెళ్లంట’ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు

ఉయ్యాల జంపాల సినిమాతో కెరీర్ స్టార్ట్ చేశారు యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun). ఆ తర్వాత సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ సినిమాలతో యూత్‌కు దగ్గరయ్యారు. వీటి తర్వాత చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మంచు విష్ణు, రాజ్ తరుణ్‌ హీరోలుగా తెరకెక్కిన ఈడో రకం, ఆడో రకం సినిమా మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల రాజ్ చేసిన ‘స్టాండప్ రాహుల్’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

ఇక, రాజ్ తరుణ్‌ ప్రస్తుతం ఓటీటీలో తన సత్తా చూపెట్టడానికి రెడీ అవుతున్నారు. అహ నా పెళ్లంట వెబ్‌ సిరీస్ ద్వారా ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. నవంబర్‌‌ 17వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్ధ ‘జీ5’ (Zee5)లో స్ట్రీమింగ్‌ కానుంది ఆయన నటించిన ‘అహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్. త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో సిరీస్ ట్రైలర్‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

సరైన హిట్ సినిమా కోసం  ఎదురుచూస్తున్న హీరో రాజ్ తరుణ్ (Raj Tarun).. జీ5లో స్ట్రీమింగ్‌ కానున్న ‘అహ నా పెళ్లంట’ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో..

హీరో చిన్నప్పటి నుంచి ఏ అమ్మాయినీ చూడకూడదు అని ప్రామిస్ చేయించుకుంటుంది తల్లి. అయితే విచిత్రంగా హీరో అమ్మాయిలను చూసిన ప్రతీసారీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దీంతో అతను అమ్మాయిల వైపు చూడడమే మానేస్తాడు. చివరకు పెళ్లి చేసుకుంటాను సంబంధాలు చూడమని ఇంట్లో చెప్పేస్తాడు. తీరా పెళ్లి ఫిక్స్ అయి తర్వాత హీరో లైఫ్‌లోకి వేరే అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత హీరో లైఫ్‌ ఎలాంటి మలుపులు తిరిగింది అనే కాన్సెప్ట్‌తో వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది.

ఈ వెబ్‌సిరీస్‌లో రాజ్‌తరుణ్‌ (Raj Tarun)కు జోడీగా శివానీ రాజశేఖర్‌ నటించారు. టీజర్‌తోనే వెబ్‌ సిరీస్‌పై అంచనాలు ఏర్పడేలా చేసింది చిత్ర యూనిట్. జీ-5 (Zee5)తో కలిసి తమాడా మీడియా ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌ ఎనిమిది ఎపిసోడ్‌లుగా రూపొందింది.

Read More : సంక్రాంతి బరిలో చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (BalaKrishna).. ఒక్కరోజు తేడాతో విడుదల కానున్న సినిమాలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!